Doctors Meet Cm Mamata Banerjee : జూనియర్ వైద్యులు, బంగాల్ ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం రెండోసారి సీఎం ఆహ్వానం మేరకు చర్చించడాని వెళ్లిన వైద్యులు లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటూ పట్టుబట్టారు. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సాధ్యం కాదని సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వైద్యులు తనను పదేపదే తనను అవమానించడం తగదని వ్యాఖ్యానించారు. దీంతో వెనక్కి తగ్గని డాక్టర్లు చర్చలు జరపకుండానే వెనుదిరిగారు.
#WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: The delegation of junior doctors who went to meet West Bengal Chief Minister Mamata Banerjee leaves from her residence in Kolkata after the meeting between them and the CM failed for the second time.
— ANI (@ANI) September 14, 2024
Junior doctors… pic.twitter.com/5XTZCET9PA
దీనికి ముందు జరిగిన పరిణామాలపై ఓ వైద్యుడు వివరించారు. ''ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేం కోరాం. సీఎం నివాసంలో లైవ్ స్ట్రీమింగ్ సాధ్యం కాదని చీఫ్ సెక్రటరీ తెలిపారు. పారదర్శకత కోసం లైవ్ స్ట్రీమింగ్ కావాలని మేము సీఎస్‌కు చెప్పాము. అంతేకాకుండా, లైవ్‌స్ట్రీమింగ్‌కు బదులు, దయచేసి మా వీడియోగ్రాఫర్‌ని అనుమతించండి అని కోరాం. అతను మీటింగ్‌ను రికార్డ్ చేస్తాడు. భద్రతా కారణాల దృష్ట్యా మేము ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటున్నాము. ఈ సమావేశంలో పారదర్శకత కోసమే లైవ్ స్ట్రీమింగ్ కావాలంటున్నాం. నిరసన తెలుపుతున్న ఇతర డాక్టర్లుకు కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని మేము సీఎం ఇంటి ముందు వేచి చూస్తున్నాం'' అని జూనియర్ డాక్టర్ తెలిపారు.
#WATCH | Kolkata, West Bengal: A delegation of junior doctors protesting over the RG Kar Medical College and Hospital rape-murder case, arrive at the Chief Minister's residence to attend a meeting with CM Mamata Banerjee regarding their demands. pic.twitter.com/XpD7KWrntt
— ANI (@ANI) September 14, 2024
అంతకుముందు, కాళీఘాట్‌లోని తన నివాసానికి చేరుకున్న వైద్యులతో మమత బెనర్జీ మాట్లాడారు. ''మీరంతా సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాను. ఈ విషయం కోర్టులో పరిధిలో ఉంది. అందువల్ల చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. ఈ సమావేశాన్ని వీడియో-రికార్డ్ చేస్తాం. సుప్రీంకోర్టు నుంచి అనుమతి పొందిన అనంతరం ఆ కాపీని మీకు అందిస్తాం. నేడు మీరు చర్చలకు వస్తామన్నారు. అందుకే మీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను. చర్చలకు వచ్చి ఇలా అవమానించడం తగదు. దయచేసి నన్ను ఇలా అవమానించకండి. ఇప్పటికే నేను మీ కోసం మూడు సార్లు వేచిచూశాను. కానీ మీరు రాలేదు'' అని మమత వారితో చెప్పారు.
Kolkata, West Bengal: Dr Arnab Mukherjee, a junior doctor who was part of the delegation that went to meet CM Mamata Banerjee, says, " we requested for live streaming of this meeting. the chief secretary said live streaming is not possible as it is cm's residence. we told the… https://t.co/UXrieH3Fwz pic.twitter.com/krAXrWiq9T
— ANI (@ANI) September 14, 2024
శనివారం మధ్యాహ్నం బంగాల్ సీఎస్ మనోజ్‌పంత్ డాక్టర్లను సీఎంతో చర్చలకు ఆహ్వానించారు. 15మంది వైద్యులు రావచ్చని సూచించారు. డాక్టర్లు నిరసనలు చేస్తున్న స్వాస్థ్య భవన్ వద్దకు మమతాబెనర్జీ ఆకస్మికంగా వెళ్లి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కొన్ని గంటలకే ఈ పరిణామం జరిగింది. దీంతో ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు కాళీఘాట్‌లోని సీఎం మమతాబెనర్జీ ఇంటికి వెళ్లారు. ఐతే, లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటూ పట్టుబట్టడం వల్ల ఈ మరోసారి చర్చలపై ప్రతిష్టంభన నేలకొంది.
జూనియర్ వైద్యులను కలిసిన మమత- రాజీకొచ్చే ప్రసక్తే లేదన్న డాక్టర్లు - Mamata Visits Protest Site