ETV Bharat / snippets

ఇజ్రాయెల్​కు 165 మిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలు- అమెరికా మరో భారీ సాయం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 7:09 AM IST

US Israel Weapons Deal
US Israel Weapons Deal (ANI)

US Israel Weapons Deal : ఇజ్రాయెల్​కు మరో భారీ సాయం చేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇజ్రాయెల్​కు 165 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో ఆయుధాల విడిభాగాలు, మరమ్మతుల పరికరాలు, టూల్ కిట్లు, సాంకేతిక, రవాణా సహకారం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆయుధాల సరఫరా 2027 నాటికి ఉండొచ్చని తెలిపింది. హమాస్‌తో పోరు సందర్భంగా 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సమకూరుస్తామని ఈ ఏడాది ఆరంభంలో అమెరికా ప్రకటించింది. వాటిలో F-15 ఫైటర్‌ జెట్లు ఉంటాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.