ETV Bharat / state

ఈ దేశాల్లో IELTS అవసరం లేకుండానే యూనివర్శిటీల్లో అడ్మిషన్లు - Study Abroad Without IELTS

author img

By ETV Bharat Telangana Team

Published : 24 hours ago

Updated : 24 hours ago

Students Study Abroad Without IELTS 2024 : విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్షల ప్రాముఖ్యం తెలుసు. అందులో మంచి స్కోరు సంపాదించి ఉన్నత విద్యాసంస్థలో సీటు తెచ్చుకోవాలని ఆశపడుతుంటారు. కానీ కొన్ని దేశాల్లో ఈ పరీక్షతో అవసరం లేకుండానే చదువుకునే వీలుందని తెలుసా? ఎటువంటి స్కోరూ అవసరం లేకుండా నేరుగా యూనివర్శిటీ నిబంధనలు అనుసరించి ప్రవేశాలు పొందవచ్చు. ఆ దేశాలు వివరాలు ఏంటో తెలుసుకుందాం.

Without IELTS Countries
Students Study Abroad Without IELTS 2024 (ETV Bharat)

Without IELTS Countries : నేడు ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని ఆశపడుతున్నారు. కానీ విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆయా దేశాలు ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో మంచి స్కోరు సంపాదించిన వారికి ఉన్నత విద్యాసంస్థలో సీటు వస్తుంది. దీంతో కొంత మంది విదేశాల్లో చదవుకోవాలనే కల కళగానే మిగిలిపోతుంది. కాని కొన్ని దేశాల్లో ఎటువంటి స్కోరూ అవసరం లేకుండా నేరుగా యూనివర్శిటీ నిబంధనలు అనుసరించి ప్రవేశాలు పొందవచ్చు. ఆ దేశాలు వివరాలు ఏంటో తెలుసుకుందాం.

జర్మనీలో భాష విశయంలో కొంత సౌకర్యం : జర్మనీలో తక్కువ ఖర్చులో ఉన్నత ప్రమాణాలతో విద్య దొరుకుతుంది అనేది తెలిసిన విషయమే. ఇందులో చాలా విద్యాసంస్థలు ఐఈఎల్‌టీఎస్‌ లేకుండా టోఫెల్‌ లేదా తమ సొంత లాంగ్వేజ్‌ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ భాష విషయంలో కాస్త సౌకర్యం లభిస్తుంది.

ఫ్రాన్స్‌ స్థానిక పరీక్షతో ప్రవేశాలు : తన సాంస్కృతిక వైవిధ్యాలతో ఆకట్టుకుంటుందీ దేశం. అంతేకాదు పేరెన్నికగన్న విద్యావిధానాలు ఇక్కడి ప్రత్యేకత. చాలా ఫ్రెంచ్‌ వర్శిటీలు డీఈఎల్‌ఎఫ్‌ లేదా డీఏఎల్‌ఎఫ్‌ (స్థానిక పరీక్ష)తో ప్రవేశాలు అందిస్తాయి.

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని టాప్‌ టైర్‌ కాలేజీల్లో సీటు సంపాదించాలంటే ఐఈఎల్‌టీఎస్‌ అవసరం లేదు. ఆల్టర్నేటివ్‌ ఇంగ్లీష్‌ ప్రొఫిషియన్సీ టెస్టులను ఇవి అనుమతిస్తాయి. పీటీఈ అకడమిక్‌ లేదా కేంబ్రిడ్జ్‌ ఇంగ్లీష్‌ ఎగ్జామ్స్‌ వంటివి ముఖ్యమైన ఉదాహరణలు.

కెనడా : చక్కని వాతావరణం, ఉన్నతమైన విద్యాప్రమాణాలతో కెనడా ఎప్పుడూ విద్యార్థుల ఆలోచనల్లో ఉంటుంది. ఇక్కడి విద్యాసంస్థల్లో టోఫెల్, పీటీఈ అకడమిక్, ఇతర భాషా ప్రావీణ్య పరీక్షల స్కోరులను అనుమతిస్తున్నారు. ఎంచుకున్న యూనివర్సిటీను బట్టి ఇది మారుతుంది.

న్యూజిలాండ్‌ : అందమైన ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇది పెట్టింది పేరు. ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు లేని విద్యార్థుల నుంచి ఇతర ప్రొఫిషియన్సీ టెస్టులను ఈ దేశం అనుమతిస్తుంది.

సింగపూర్‌ : వైవిధ్యమైన నగర జీవితానికీ విద్యావిధానానికీ ఇక్కడకు వెళ్లాల్సిందే. ఈ దేశంలో విద్యార్థులకు ఇంటర్నల్‌ లాంగ్వేజ్‌ అసెస్‌మెంట్స్ తీసుకునే వీలుంది. లేదా ఇతర టెస్టులకు హాజరై ఆ స్కోరును కూడా అందజేయవచ్చు, ఐఈఎల్‌టీఎస్‌ అవసరం లేదు.

మలేసియా : తక్కువ ఖర్చుతో విద్యాభ్యాసం పూర్తి చేయాలనుకునేవారికి మలేసియా చక్కని ప్రత్యామ్నాయం. చాలా యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్‌కు ప్రత్యామ్నాయ పరీక్షలతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. విదేశీ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఇవేకాక జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి అనేక దేశాలు కేవలం ఐఈఎల్‌టీఎస్‌ పైన ఆధారపడకుండా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక అవసరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫారిన్​లో హయ్యర్ స్టడీస్​ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Abroad Higher Education Guide

అమెరికాలో చదుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే పక్కా విసా కన్ఫామ్​ - Study In America

Last Updated : 24 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.