BMW F900 GS and GS Adventure Launched: ప్రముఖ బైక్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ 'F900 GS', 'F900 GS అడ్వెంచర్' బైక్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. F850 GS మోడల్లో మార్పులు చేస్తూ అప్డేటెడ్ బాడీవర్క్, ఇంజిన్లతో ఈ రెండు బైకులను రూపొందించారు. దీంతోపాటు ఇవి భారీ 895cc లిక్విడ్-కూల్డ్ ట్విన్- సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్ల బుకింగ్స్‌ను గత నెల నుంచే కంపెనీ ప్రారంభించింది. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.
BMW F900 GS, GS అడ్వెంచర్ ఫీచర్లు:
ఇంజిన్: 895cc లిక్విడ్-కూల్డ్ ట్విన్-సిలిండర్
- LED లైటింగ్
- మల్టీ రైడింగ్ మోడ్
- పవర్ మోడ్
- హీటెడ్ హ్యాండిల్ బార్ గ్రిప్స్
- ట్రాక్షన్ కంట్రోల్
- ABS
- బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్
- USB ఛార్జింగ్ పోర్ట్
- ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీ
- 6-స్పీడ్ గేర్‌బాక్స్‌లు
- కలర్ ఆప్షన్స్: ఈ రెండు బైకులు రెండేసి కలర్ ఆప్షన్స్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
BMW F900 GS కలర్ ఆప్షన్స్:
- స్టైల్ ప్యాషన్ వేరియంట్‌లో సావో పాలో ఎల్లో సాలిడ్ పెయింట్‌తో లేదా లైట్ వైట్ సాలిడ్ పెయింట్
- రేసింగ్ బ్లూ మెటాలిక్ డ్యూయల్ టోన్ కలయికతో 'GS ట్రోఫీ' వేరియంట్
BMW F900 GS అడ్వెంచర్ కలర్ ఆప్షన్స్:
- బ్లాక్ స్టార్మ్ మెటాలిక్
- మ్యాట్ వైట్ అల్యూమినియం
వేరియంట్స్:
- BMW F900 GS
- BMW F900 GS అడ్వెంచర్
ఈ రెండు వేరియంట్‌లు పూర్తిగా దిగుమతి చేసుకున్న బిల్ట్-అప్ (CBU) మోడల్స్.
ధర:
- BMW F900 GS ధర: రూ.13.75 లక్షలు (ఎక్స్- షోరూమ్)
- BMW F900 GS అడ్వెంచర్ ధర: రూ.14.75 లక్షలు (ఎక్స్- షోరూమ్)
మార్కెట్లో వీటికి పోటీ: ఈ బైకులు ఇండియాలోని 800-900 cc విభాగంలో ట్రయంఫ్ టైగర్ 900, సుజుకి V-Strom 800 DE వంటి వాటితో పోటీపడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా.
బెస్ట్ ఫర్ ఆఫ్-రోడ్ యూజ్: టూరింగ్ ఔత్సాహికుల కోసం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ రెండు బైకులను రూపొందించింది. ఈ వెర్షన్ బైక్స్‌లో ఆఫ్-రోడ్ టైర్స్, 23-లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెరుగైన సస్పెన్స్ ఉన్నాయి.