Asaduddin Owaisi on One Day One Election : జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. అనంతరం జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్టవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జమిలి ఎన్నికల ఆమోదంపై ఎక్స్ వేదికగా స్పందించారు.
AIMIM Chief Asadudddin Owaisi tweets, " i have consistently opposed one nation one elections because it is a solution in search of a problem. it destroys federalism and compromises democracy, which are part of the basic structure of the constitution. multiple elections aren’t a… pic.twitter.com/5grbv13OkP
— ANI (@ANI) September 18, 2024
తాను ఒకే దేశం ఒకే ఎన్నికలను స్థిరంగా వ్యతిరేకించానని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎందుకంటే ఇది సమస్య కోసం ఒక పరిష్కారమని, ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని స్పష్టం చేశారు. ఈ అంశం పురపాలక సంఘం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని ధ్వజమెత్తారు. జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో దేశానికి ఏకకాల ఎన్నికలు అవసరం కాదని తేల్చిచెప్పారు. తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబు దారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఒవైసీ పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలపై తీవ్ర విమర్శలు : గతంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ నాయకులు జమిలి ఎన్నికలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానానికి వ్యతిరేకమని గతంలోనే రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఓడిపోతామనే భయంతోనే జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చారని ఆరోపించారు. సీపీఐ సైతం జమిలి ఎన్నికలపై వ్యతిరేకంగా ఉంది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడం అనేది తలకిందులుగా తపస్సు చేసిన వీలుగాని అంశమని ఈ నెల 3న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామనడం సరికాదని హితవు పలికారు.
బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తున్నారా - బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందా?: అసదుద్దీన్ ఓవైసీ