ETV Bharat / politics

జగన్​కు మరో షాక్ - వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన బాలినేని - Balineni Srinivasa resign to YSRCP

Balineni Srinivasa Reddy resigned to YSRCP: తనకు పార్టీలో తగిన ప్రాధాన్యమే లేదని, కొనసాగలేనంటూ నేరుగా పార్టీ అధ్యక్షుడు జగన్​కే చెప్పిన బాలినేని, ఇప్పుడు రాజీనామా చేశారు. నిన్నమొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన బాలినేని ఇప్పుడు వైఎస్సార్​సీపీకి షాక్​ ఇచ్చారు.

Balineni Srinivasa Reddy resigned to YSRCP
Balineni Srinivasa Reddy resigned to YSRCP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 5:17 PM IST

Updated : Sep 18, 2024, 7:27 PM IST

Balineni Srinivasa Reddy resigned to YSRCP in AP : ఏపీలో వైఎస్సార్​సీపీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. జగన్‌ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా వైఎస్సార్​సీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాను. గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవబోతున్నాను. ఆ పార్టీలో చేరబోతున్నాను’ అని బాలినేని తెలిపారు.

Balineni Srinivas Reddy resigned to YSRCP
బాలినేని శ్రీనివాస్​ వైఎస్సార్​సీపీకి రాజీనామా (ETV Bharat)

"రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్సార్​ కుటుంబానికి సన్నిహితుడుని అయినా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు కచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజాతీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం, రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం చేశాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే." - బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి

Balineni Join Janasena : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడారు. హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్​ను కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్సార్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లనూ వారించే ప్రయత్నం చేయలేదు.

జగనన్నా ఇంత పిరికితనమా? - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి : షర్మిల - YS SHARMILA TWEET ON JAGAN

ఏపీలో శాంతిభద్రతలు ఏమీ బాగోలేవు - రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్ - AP EX CM Jagan Fire on TDP Govt

Last Updated : Sep 18, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.