రికార్డు ధరకు పుష్ప 2 OTT రైట్స్- ఇండియాలో ఇదే టాప్ డీల్!
Published : Aug 31, 2024, 9:27 PM IST
|Updated : Aug 31, 2024, 10:01 PM IST
Pushpa OTT Deals:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటించిన 'పుష్ప-2' రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. రీసెంట్గా మేకర్స్ 100రోజుల కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 6న ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ పూర్తైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకుందట.
తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.270 కోట్లకు దక్కించుకున్నట్లు ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇది నిజమైతే పుష్ప-2 సరికొత్త రికార్డు నెలకొల్పినట్లవుతుంది. భారతీయ సినీ ఇండస్ట్రీ ఓటీటీ డీల్స్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక రష్మిక మంధాన హీరోయిన్గా నటించగా, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. సుకుమార్ దర్శకత్వ వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.