ETV Bharat / snippets

నివిన్ పౌలీపై కేను నమోదు- హీరో రెస్పాన్స్ ఏంటంటే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 9:17 PM IST

Nivin Pauly
Nivin Pauly (Source: Getty Images)

Hero Nivin Pauly Police Case: మలయాళ హీరో 'ప్రేమమ్' ఫేమ్ నివిన్‌ పౌలిపై కేసు నమోదైంది. ఓ నటిపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నివిన్‌ పౌలీ సహా ఆరుగురిపై కేరళ ఎర్నాకుళం పోలీసులు నాన్‌- బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. తనను గత నవంబరులో దుబాయ్‌ తీసుకెళ్లి అక్కడే లైంగికంగా వేధించినట్లు నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల జాబితాలో నివిన్‌ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​గా మారడం వల్ల హీరో స్పందించారు.

'నేను ఒక అమ్మాయిని వేధించానన్న తప్పుడు వార్త నా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం. ఈ ఆరోపణలు నిరాధారమైనని నిరూపించడానికి ఎక్కడివరకైనా వెళ్తాను. మిగిలినవి చట్టబద్ధంగా జరుగుతాయి' అని నివిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, మలయాళ 'ప్రేమమ్' సినిమాతో నివిన్​ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.