రాష్ట్రంలో తొలి కంటెయినర్‌ పాఠశాల - ఎక్కడో తెలుసా? - First Container School in Telangana - FIRST CONTAINER SCHOOL IN TELANGANA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 10:28 PM IST

First Container School in Telangana State : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతించదు. దీంతో ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఓ ఉపాధ్యాయిని, ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర వినూత్నంగా ఆలోచించి కంటెయినర్ (ప్రీ ఫ్యాబ్రికే టెడ్) స్కూల్​ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిధులు రూ.13 లక్షలతో చేపట్టి ఈ పనులు పూర్తి చేశారు. మంత్రి సీతక్క చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల విస్తీర్ణం చూస్తే 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్కులతోపాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. రాష్ట్రంలో కంటెయినర్ దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.