ETV Bharat / offbeat

"ఆంధ్ర స్టైల్​ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది! - Mutton Curry Recipe

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 2:08 PM IST

Mutton Masala Recipe : నాన్​వెజ్​లో ఎన్ని రకాలున్నా.. మటన్ టేస్ట్​ మాత్రం ఎప్పుడూ టాప్​లోనే ఉంటుంది. మటన్​ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా.. కాస్త కొత్తగా చేయాలనుకుంటున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే. ఆంధ్ర స్టైల్లో అద్దిరిపోయే మటన్​ మసాలా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Mutton Masala
Mutton Masala Recipe (ETV Bharat)

How to Make Mutton Masala Curry : నాన్​వెజ్​ ప్రియులు మాంసాహారంలో మటన్​ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక సండే వచ్చిందంటే తప్పకుండా మటన్​ ఉండాల్సిందే. కాస్త ధర ఎక్కువైనా పర్లేదు కానీ.. సండే రోజు టేస్టీ మటన్ తినాల్సిందేనంటారు నాన్​వెజ్ లవర్స్ చాలా మంది​. అయితే.. నార్మల్​గా మటన్ కర్రీని అందరూ వండుతారు. ఇదే తిని ఇంట్లో వాళ్లందరికి కాస్త బోర్​గా అనిపిస్తుంది. అయితే, మీ కోసమే ఆంధ్ర స్టైల్లో ఘుమఘుమలాడే 'మటన్​ మసాలా రెసిపీ'ని పరిచయం చేయబోతున్నాం. ఒక్కసారి ఇలా చేశారంటే ఇంట్లో వాళ్లందరూ లొట్టలేసుకుంటూ ప్లేట్​ మొత్తం ఖాళీ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆంధ్ర స్టైల్లో టేస్టీ మటన్​ మసాలా కర్రీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

మటన్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • మటన్‌- అరకేజీ
  • నూనె- నాలుగు చెంచాలు
  • టేబుల్​ స్పూన్-​ నెయ్యి
  • పచ్చి కొబ్బరి ముక్కలు-అరకప్పు
  • జీడిపప్పు- అరకప్పు (నీటిలో నానబెట్టండి)
  • గసగసాలు- రెండు చెంచాలు(నీటిలో నానబెట్టండి)
  • ఉల్లిపాయలు-2
  • టమాటాలు-2
  • పచ్చిమిర్చిలు-4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు- తగినంత
  • పసుపు-అరటీస్పూన్​
  • కరివేపాకు -2 రెమ్మలు
  • కొత్తిమీర- కొద్దిగా
  • ధనియాలపొడి- చెంచా
  • గరంమసాలాపొడి- టీస్పూన్​
  • వేయించిన జీలకర్రపొడి - టీస్పూన్​
  • కారం- రెండు చెంచాలు

తయారీ విధానం..

  • మటన్​ రెండుమూడుసార్లు నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
  • స్టౌపై​ ప్రెషర్​ కుక్కర్​ పెట్టి అందులో మటన్​ వేయండి. ఇందులో లీటర్​కు పైగా నీళ్లను యాడ్​ చేసుకుని మీడియమ్​ ఫ్లేమ్​లో 6 నుంచి 7 విజిల్స్​ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లో నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి. ఈ పేస్ట్​ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి.
  • అదే మిక్సీ గిన్నెలో కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలు వేసుకుని నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
  • అలాగే టమాటా ఫ్యూరీ పేస్ట్​ కూడా సిద్ధం చేసుకోండి.
  • ఇప్పుడు పాన్​లో ఆయిల్​ వేసుకుని వేడి చేయండి. ఇందులో కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్​ వేసి వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు పసుపు, ధనియాలపొడి, కారం వేసి కలపండి.
  • ఇందులో టమాటా ఫ్యూరీ, పచ్చికొబ్బరి, గసగసాల పేస్ట్​ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి మటన్​ని ఉడికించుకోగా మిగిలిన వాటర్​ యాడ్​ చేసి.. మూత పెట్టి పులుసు మరిగించండి.
  • ఇప్పుడు ఉడికించుకున్న మటన్​ ముక్కలు, గరంమసాలా పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలెంత వరకు ఉడికించుకోండి.
  • మటన్​ కర్రీ దింపేసుకునే ముందు టేబుల్​ స్పూన్​ నెయ్యి, కొత్తిమీర చల్లుకుంటే.. నోరూరించే ఆంధ్ర స్టైల్​ మటన్ మసాలా కర్రీ మీ ముందుంటుంది. నచ్చితే మీరు కూడా ఈ టేస్టీ మటన్​ కర్రీని ఇంట్లో ప్రిపేర్​ చేయండి. ​

ఇవి కూడా చదవండి :

సండే స్పెషల్​: అద్దిరిపోయే "మటన్​ ఛుడ్వా" - ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించండిలా!

సండే స్పెషల్​ : రాయలసీమ స్టైల్​ స్పైసీ "మటన్​ వేపుడు" - ఇలా ప్రిపేర్ చేశారంటే మసాలా ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.