ETV Bharat / state

అక్కడ గజం రూ.లక్ష - అయినా అందరి చూపూ అటు వైపే - Real Estate Business in Hyderabad

Real Estate In Hyderabad : హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్న క్రమంలో భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఒకప్పుడు కోకాపేట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూముల వైపు చూసేవారు. కానీ ఇప్పుడు నగరవాసులు తూర్పు ఈశాన్యంలో ఉన్న కాప్రా, ఈసీఐఎల్ వైపు చూస్తున్నారు.

Real Estate In kapra
Real Estate In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 2:40 PM IST

Real Estate In Hyderabad : హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ అంటే కోకాపేట, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ కానీ ఇప్పుడు ఆ ధోరణి మారింది. హైదరాబాద్​లోని శివార్లలోని పారిశ్రామిక హబ్‌గా పేరుగాంచిన కాప్రా, ఈసీఐఎల్‌ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌), అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎఫ్‌సీ), హిందుస్థాన్‌ కేబుల్‌ కంపెనీ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసర్చ్‌ (టీఎఫ్‌ఐఆర్‌) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రాకతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందింది.

చర్లపల్లి, కుషాయిగూడ, మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లో నెలకొన్న పరిశ్రమలతో ఈ ప్రాంతం విస్తరించింది. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి కావడంతో భూముల రేట్లు పెరిగాయి. వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో స్థలాలు దొరకడం కష్టం అయింది. నివాస యోగ్యమైన ప్రాంతం కావడంతో స్థలాలు అత్యంత ఖరీదు కావడంతో బహుళ అంతస్తుల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

షాపింగ్‌ మాల్స్, కళాశాలలు, ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులోక ఉండగా కూత వేటు దూరంలో చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏపీతో పాటు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంటే దేశంతో పాటు విదేశాల్లో ఉన్నవారికి సైతం సుపరిచితం. ఈ నేపథ్యంలో ఇక్కడ రియల్‌ మార్కెట్‌కు మంచి గిరాకి ఉంది.

ఈసీఐఎల్‌-ఏఎస్‌రావునగర్‌-సైనిక్‌పురి ప్రధాన రహదారి, ఈసీఐఎల్‌-ఎస్పీనగర్‌-మౌలాలీ రేడియల్‌ రోడ్డు, ఈసీఐఎల్‌-కుషాయిగూడ-చక్రీపురం-కీసర రేడియల్‌ రోడ్డు ఆయా రహదారుల వెంట ప్రాంతాన్ని బట్టి స్థలాలు గజానికి రూ.లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు పలుకుతోంది. కాప్రా, సైనిక్‌పురి, ఈశ్వరపురి, హైటెన్షన్‌లైన్, కుషాయిగూడ, కమలానగర్, ఎస్పీనగర్, మౌలాలీ ప్రాంతాల్లో గజం రూ.80,000 నుంచి రూ. లక్ష వరకు ఉంది.

గృహ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో బహుళ అంతస్తుల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు .డిమాండ్‌ ఉన్న ప్రాంతం కావడంతో బ్యాంకు రుణాలు సులభంగా లభిస్తున్నాయి.ఇక్కడ ఫ్లాట్‌ కొన్నవారు తిరిగి అమ్మాలనుకున్నా ధర బాగి పలికి మంచి లాభాలు వస్తాయి. ఇక్కడి ప్లాట్లు ఎస్‌ఎఫ్‌టీ రూ.4,000-7,000 వరకు పలుకుతోంది. వసతులు, ఆధునిక హంగులతో నిర్మాణాలు జరిగిన వాటికి గిరాకీ ఉంటోంది. కొందరు బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లు పెట్టి మార్కెట్‌ చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ జనాల అభిరుచికి అనుగుణంగా ప్లాట్ల నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు బిల్డర్లు. ఆధునిక డిజైన్లు, యువతకు కావాల్సిన ఉడ్ వర్క్‌తో నిర్మిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కావాల్సిన సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నారు. బహుళ అంతస్తులకు నిలయంగా కాప్రా ప్రాంతాలు గుర్తింపు పొందుతున్నాయి. భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్న ఆ ప్రాంతంలో కొనుగోళ్లు ఏ మాత్రమం తగ్గకుండా జరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ - ఆ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొంటే భవిష్యత్తు బంగారమేనట! - Real Estate Business in Hyderabad

గజం భూమి అక్షరాలా రూ.20 లక్షలు - హైదరాబాద్​లోనే కానీ, మీరనుకుంటున్న చోట మాత్రం కాదు! - High land cost in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.