"గతేడాది బాలాపూర్ లడ్డూతో ప్రశాంతత దక్కింది - ఆర్థికంగా ఎంతో సంతృప్తి చెందా " - Balapur Ganesh Auction 2024 - BALAPUR GANESH AUCTION 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 9:54 PM IST

Interview with 2023 Balapur Ganesh Laddu Winner : గణేశుడి వేడుకలంటే గల్లీ నుంచి దిల్లీ వరకు జోరుగా సాగుతాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ప్రతి ఒక్కరూ వినాయక ఉత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అందులో భాగంగా లడ్డూ వేలం పాటలు హుషారెత్తిస్తుంటాయి. అందుకు నిదర్శనమే రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్. అక్కడ 30 ఏళ్లుగా జరుగుతున్న వేలం పాటను గ్రామస్థులే కాకుండా వివిధ ప్రాంతాల్లోని వారంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు. బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ మహిమ అలాంటిది. వేలం పాటను వీక్షించేందుకు గ్రామస్థుల ఇళ్లకు బంధువులు, చుట్టాలు, సన్నిహితులు ముందే వస్తారు.

అంతలా ప్రతి ఏడాది ఆసక్తికరంగా మారుతోంది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ నమ్మకానికి నిదర్శనమని, గతేడాది లడ్డూ విజేత దాసరి దయానందరెడ్డి అన్నారు. బాలాపూర్​లో గణేశుడు కొలువుదీరిన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని, లడ్డూ దక్కించుకోవడం తనకెంతో ప్రశాంతత నిచ్చిందన్నారు. వేలంపాటలో రూ.27 లక్షలకు లడ్డూ దక్కించుకొని తన గ్రామంలోని వారందరికి పంచినట్లు చెబుతున్న దయానందరెడ్డి, 2022లో ఒకసారి వేలం పాటకు ప్రయత్నించినట్లు వివరించారు. కాగా గత సంవత్సరం గణేశుడు తనను కరుణించాడని పేర్కొన్నారు. లడ్డూ దక్కించుకోవడం వల్ల కుటుంబపరంగా, ఆర్థికంగా ఎంతో సంతృప్తి కలిగిందంటోన్న లడ్డూ విజేత దయానందరెడ్డితో ఈటీవీభారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.