ETV Bharat / snippets

మోహన్ బాబు డియరెస్ట్ గేయ రచయిత కన్నుమూత- ప్రముఖల సంతాపం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 12:38 PM IST

Lyricist Gurucharan Passed Away
Mohan Babu Favourite Lyricist Gurucharan (ETV Bharat)

Lyricist Gurucharan Passed Away : 'ముద్దబంతి పువ్వులో మూగబాసలు', 'కుంతీకుమారి తన నోరుజారి', 'బోయవాని వేటుకు గాయపడిన కోయిలా' లాంటి సూపర్ హిట్ పాటలను రచించిన ప్రముఖ గేయ రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు ఈయన. MA చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు.

ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఈయనంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన సినిమాల్లో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన పలు మెలోడీ, అర్థవంతమైన పాటలన్నీ గురుచరణ్ రచించినవే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.