'ఓల్డ్ ఈజ్ గోల్డ్'- వింటేజ్ కార్ల ర్యాలీ చూస్తే ఔరా అనాల్సిందే! - కోల్‌కతాలో వింటేజ్ కార్ల ర్యాలీ
Published : Feb 5, 2024, 6:12 AM IST
Vintage Cars Rally In Kolkata : ఆటో మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఇండియా ఆధ్వర్యంలో బంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన వింటేజ్ కార్ల ర్యాలీ ఆకట్టుకుంటోంది. 90వ దశకంలోని వివిధ కంపెనీలకు చెందిన పాత కార్లను ర్యాలీకి తీసుకొచ్చారు. వీటిని చూసేందుకు వాహన ప్రియులు బారులు తీరారు. అలనాటి కార్లను తమ కెమెరాల్లో బంధించారు. ఆటో మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఇండియా ప్రతి సంవత్సరం ఈ కార్ల ర్యాలీ నిర్వహిస్తోంది. ఏటా జరిగే ఈ వింటేజ్ కార్ల ప్రదర్శనను వీక్షించేందుకు కోల్‌కతాతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా తరలివస్తుంటారు.
చెన్నైలో వింటేజ్ కార్ల షో
ఇటీవలే చెన్నైలో వింటేజ్ కార్ కలెక్టర్స్ ఎక్స్‌పో జరిగింది. హిస్టారికల్ కార్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా- హెచ్సీఏఐ ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ కార్లను ప్రదర్శను ఏర్పాటు చేశారు. 'హెరిటేజ్ రోలర్స్ 2023' పేరుతో ప్రముఖ సంస్థలకు చెందిన అలనాటి మేటి కార్లను ఈ ప్రదర్శనలో ఉంచారు. రోల్స్‌రాయిస్, వోల్వో, షెవర్లే, బెంట్లీ సంస్థలకు చెందిన అరుదైన పాత కార్లను వాటి యజమానులు ప్రదర్శనకు తెచ్చారు. ఈ కార్ షోలో 68 కార్లు, 20 బైక్‌లు ప్రదర్శనకు ఉంచారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.