LIVE : శ్రీవారి బ్రహ్మోత్సవాలు - వైభవంగా రథోత్సవం - SRIVARI BRAHMOTSAVAM 2024
Published : Oct 11, 2024, 8:08 AM IST
|Updated : Oct 11, 2024, 9:43 AM IST
Srivari Rathotsavam 2024 : అంగరంగ వైభవంగా సాగుతున్న తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకొన్నాయి. బ్రహ్మోత్సవాల్లో గడచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేసిన స్వామివారు ఎనిమిదవరోజు మహారథంపై ఊరేగుతున్నారు. రాత్రి జరిగే అశ్వవాహన సేవతో స్వామి వారి సేవలు పరిసమాప్తం కానున్నాయి.రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే రథంపై విహరించే శ్రీవిష్ణువు దర్శించుకొంటే పునర్జన్మ ఉండదన్నది పురాణోక్తి. బ్రహ్మోత్సవాల వేళ మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడు రోజుల పాటు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ఎనిమిదో రోజు ప్రాతః కాలం సమయాన మహారథం అధిష్టించనున్నారు. ధారు రథంపై శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు దర్శనమివ్వనున్నారు. అనేకమైన వర్ణవస్త్రాలు, తోరణాలు, శిల్పాలు, పుష్పమాలలు, బంగారు కలశం, బంగారు గొడుగుతో ఈ మహారథాన్ని అలంకరిస్తారు. ఉభయదేవేరులతో రథంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వాసం.
Last Updated : Oct 11, 2024, 9:43 AM IST