LIVE : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు - TELANGANA ASSEMBLY LIVE
Published : 12 hours ago
|Updated : 6 hours ago
Telangana Legislative Assembly Winter Sessions Live : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరో రోజు కొనసాగనున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు. అయితే ఈ ఉదయం 10 గంటలకు "భూ భారతి'' బిల్లుపై చర్చతో శాసనసభ ప్రారంభమవుతుంది. ఆ తరువాత రైతు భరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఇక శాసన మండలిలో జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాన మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కలు ప్రవేశ పెడతారు. మండలిలో రైతు బరోసా విధి విధానాలపై లఘు చర్చ ఉంటుంది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టేదానిపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ చట్టంలో సెక్షన్ 374బి చేర్చడం ద్వారా హైడ్రా కమిషనర్‌కు అధికారాలను కట్టబెడుతున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి వెల్లడించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం హైడ్రాను తెచ్చిందని స్పష్టం చేశారు. దీనిపై బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. అనాలోచితంగా అనేక నిర్మణాలను కూల్చివేశారని పేదలు భయపడే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ సభ్యులు విమర్శించారు.
Last Updated : 6 hours ago