మాజీ మంత్రి హరీశ్​రావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - BRS LEADER HARISH RAO LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

BRS Leader Harish Rao Live : తొలి అడుగులోనే కేటీఆర్‌ నైతిక విజయం సాధించారని బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్​ కేసుపై హరీశ్​రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్​పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిందన్నారు. ఫార్ములా ఈ రేసింగ్​పై సభలో చర్చించాలని కోరామని హరీశ్​ రావు తెలిపారు. బీఆర్ఎస్​ సభ్యులను శాసనసభ నుంచి బయటకి పంపి చర్చించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్​రావు పలు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి శాసనసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు అని హరీశ్​రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్​ రేసింగ్​పై పలు విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏవీవీ కంపెనీ డిసెంబర్‌ 22న దానం కిశోర్‌కు లేఖ రాశారు తెలిపారు. మూడో విడత కింద 45 లక్షల పౌండ్లు చెల్లించకపోవడం వల్ల అగ్రిమెంట్‌ రద్దు చేసుకుంటున్నామని లేఖ రాసిందని వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీశ్​రావు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.
Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.