PUSHPA 2 OTT RELEASE : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 : ది రూల్ ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ సినీ హిస్టరీలో ఏ కమర్షియల్ చిత్రం సాధించనన్ని వసూళ్లను అందుకుంటోంది. అయితే ఈ క్రమంలో ‘పుష్ప 2 ఓటీటీపై వార్తలు వచ్చాయి. జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ పోస్టులు కనిపించాయి.
అయితే దీనిపై తాజాగా చిత్రబృందం స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కన్నా ముందు ఏ ఓటీటీలోనూ ఈ సినిమా విడుదల కాదని క్లారిటీ ఇచ్చింది. సిల్వర్స్క్రీన్పైనే పుష్ప 2ను చూసి హాలీడే సీజన్‌ను ఎంజాయ్ చేయమని పేర్కొంది.
"పుష్ప 2 : ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై చాలా వార్తలు వస్తున్నాయి. రాబోయే అతి పెద్ద హాలీడే సీజన్‌లో ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి ఆస్వాదించండి. రిలీజైన నాటి నుంచి 56 రోజుల కన్నా ముందు ఏ ఓటీటీలోనూ పుష్ప 2 స్ట్రీమింగ్ కాదు. ఇది వైల్డ్ ఫైర్ పుష్ప. వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లోనే" అంటూ మైత్రీ మూవీ మేక్సర్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ అడ్డాలో 'పుష్ప 2' సరికొత్త రికార్డ్ - 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా!
'ఆ రెండింటికి ఎటువంటి సంబంధం ఉండదు!' - పవన్ కల్యాణ్‌పై 'సలార్' భామ వైరల్ కామెంట్స్