LIVE : తెలంగాణ భవన్​లో కేటీఆర్​ ప్రెస్​మీట్ - ప్రత్యక్షప్రసారం - KTR LIVE FROM TELANGANA BHAVAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

KTR Live From Telangana Bhavan : ఫార్ములా ఈ కార్​ రేసు వ్యవహారంలో గవర్నర్​ అనుమతితో తదుపరి చర్యలుకు ప్రభుత్వం ఉపక్రమించింది. విచారణ చేపట్టాలని ఏసీబీకి నిన్న సీఎస్​ శాంతి కుమారి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్​ రేసులో ఏ1గా కేటీఆర్​ను చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ కార్​ రేసు కేసులో తనపై కేసు నమోదుపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ రేసులో కుంభకోణం జరిగిందని అంటున్నారన్న ఆయన ఈ అంశంపై శాసన సభలో చర్చ పెట్టండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చకు పెట్టాలి అని కేటీఆర్​ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్​ రేసుపై అన్ని వాస్తవాలు వివరిస్తానని కేటీఆర్​ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్​ రేస్​ అంశంపై తెలంగాణ భవన్​ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.