ETV Bharat / entertainment

థియేటర్లలోకి 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ - టికెట్ ధర ఎంతో తెలుసా? - RRR DOCUMENTARY RELEASE

సెలెక్టడ్ థియేటర్స్​లో 'ఆర్‌ఆర్ఆర్‌' స్పెషల్‌ డాక్యుమెంటరీ రిలీజ్ - టికెట్‌ ధర ఎంతంటే?

RRR Documentary Release
RRR Documentary Release (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 2:53 PM IST

RRR Documentary Release : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్​ జూనియర్ ఎన్​టీఆర్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన బ్లాక్​బస్టర్ మూవీ 'ఆర్ఆర్‌ఆర్‌'. పీరియాడిక్ యాక్షన్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్​ సాధించి దూసుకెళ్లింది. అయితే ఇప్పుడా చిత్రాన్నికి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ అలాగే మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను డాక్యుమెంటరీ రూపంలో చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. 'ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' అనే పేరుతో ఆ డాక్యుమెంటరీని సిద్ధం చేసింది. అందులో షూటింగ్‌ మొదలుపెట్టినప్పటి నుంచి 'ఆస్కార్‌' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు మేకర్స్.

అయితే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ థియేటర్లలో విడుదల కానుంది. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన కొన్ని మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో దాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ క్రమంంలో ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్‌ మై షో'లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.200 నుంచి రూ.300 వరకూ ఆ టికెట్ల ధర ఉంది. అయితే 1 గంట 38 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో మూవీ టీమ్​ 'ఆర్‌ఆర్‌ఆర్' గురించి ఇప్పటివరకూ ప్రేక్షకులకు తెలియని పలు ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు కూడా నెట్టింట మంచి రెస్పాన్స్​ దొరికింది.

ఇక 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా విషయానికి వస్తే, రామ్‌ చరణ్‌, జూనియర్​ ఎన్​టీఆర్ లీడ్ రోల్స్​లో రూపొందిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. అయితే వరల్డ్​వైడ్​గా​ ఈ చిత్రం సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది.

మరోవైపు ఓటీటీలోనూ ఈ చిత్రం హవా చూపింది. దీన్ని పలు భాషల్లో డబ్‌ చేయగా అక్కడ కూడా రికార్డు స్థాయిలో వసూలు చేసింది. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించి ఏకంగా 300 మిలియన్​ జపాన్‌ యెన్‌ల (రూ.18 కోట్లు) క్లబ్‌లో చేరింది. అంతేకాకుండా ఈ క్లబ్‌లోకి చేరిన తొలి భారతీయ సినిమాగా 'ఆర్ఆర్‌ఆర్‌' ఓ అరుదైన ఘనత సాధించింది.

ఇక జక్కన్న ప్రస్తుతం మహేశ్‌తో తీయనున్న సినిమాతో బిజీగా ఉన్నారు. 'SSMB 29' అనే వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు కంప్లీట్ కాగా, లొకేషన్ల ఎంపికపై మేకర్స్ కసరత్తులు మొదలుపెట్టారు. గ్లోబ్‌ ట్రాకింగ్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

'RRR' డాక్యుమెంటరీ ట్రైలర్‌ ఆగయా - మీరు చూశారా?

రామ్‌ చరణ్‌ అరుదైన ఘనత - అమితాబ్‌, షారుక్​ సరసన చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.