India Women vs West Indies Women : మహిళల మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను దక్కించుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హెన్రీ (43) టాప్ స్కోరర్‌గా నిలిచింది. డాటిన్ (25), హెలీ మ్యాథ్యూస్ (22) పర్వాలేదనిపించారు. జోసెఫ్ (11), క్యాంప్బెల్లి (17) పరుగులు చేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13×4,1×6), రిచా ఘోష్ ( 21 బంతుల్లో 54; 3×4, 5×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. రోడ్రిగ్స్ (39), బిస్త్ (31*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో హెన్రీ, డాటిన్, ఫ్లెచర్, అలెయ్‌నే తలో వికెట్ దక్కించుకున్నారు.
త్వరలో లండన్‌కు షిప్ట్ కానున్న విరాట్ కోహ్లీ!
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ - అధికారికంగా ప్రకటించిన ఐసీసీ