ETV Bharat / state

బైక్​ కొనడానికి డబ్బుల్లేవా? - SBI సూపర్​ లోన్​ - పూర్తి వివరాలివే! - SBI SUPER BIKE LOAN SCHEME DETAILS

-​ బైక్ లవర్స్​కు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా "సూపర్ స్కీమ్" - రూ.1.50 లక్షల నుంచి లోన్​ ఆఫర్!

SBI Super Bike Loan Scheme
SBI Super Bike Loan Scheme (SBI Super Bike Loan Scheme)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

SBI Super Bike Loan Scheme Details: ప్రజల నిత్యావసరాల్లో ద్విచక్ర వాహనం ఓ భాగమైంది. ఇంటి పనులకు తప్పనిసరిగా ఓ బైక్ లేదా స్కూటర్ ఉండాలని అందరూ కోరుకొంటున్నారు. అలాగే కొంతమంది ఉద్యోగాలకు, ఇతర పనులకు వాటిపైనే వెళ్తుంటారు. ఇక యూత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఖరీదైన, స్పోర్ట్స్​ మోడల్స్​ తమ ఇంటి ముందు స్టాండ్​ మోడ్​లో ఉండాలని ఆశపడుతుంటారు. అందుకే.. నిత్యం వేలాది బైకులు అమ్ముడవుతుంటాయి. అయితే.. కొంత మందికి బైక్​ కొనుగోలు చేయాలనే కోరిక విపరీతంగా ఉన్నప్పటికీ.. డబ్బులు మాత్రం పూర్తిస్థాయిలో ఉండవు. ఇతర అవసరాలు ఉండడంతో.. బైక్​ కోరికను వాయిదా వేస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసమే SBI సూపర్ బైక్​ లోన్ స్కీమ్ తెచ్చింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తూ వస్తోంది. వీటిల్లో లోన్స్ కూడా ఒకటి. హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ ఇలా వివిధ రకాల రుణాలను తమ వినియోగదారుల కోసం అందిస్తోంది. తాజాగా ద్విచక్ర వాహన కొనుగోలు కోసం సూపర్‌ బైక్ లోన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన కస్టమర్లు బ్యాంక్​ నిబంధనల మేరకు రుణం పొందవచ్చు. అయితే.. ఎస్‌బీఐ సూపర్​ బైక్​ లోన్ పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే..

వయసు: ఈ స్కీమ్​కు అప్లై చేయాలనుకునేవారి వయసు 21 నుంచి 57 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

లోన్​ అమోంట్​: కనిష్ఠంగా రూ.1.50లక్షల నుంచి అవసరం మేరకు బ్యాంకు అధికారులు వివరిస్తారు.

అర్హతలు :

  • కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు ఈ లోన్ పొందొచ్చు. గవర్నమెంట్ సంస్థలు, కార్పొరేషన్స్, ప్రైవేట్ రంగ కంపెనీలకు చెందిన ఉద్యోగులు కూడా ఈ లోన్​ పొందవచ్చు.
  • పన్ను చెల్లించే ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్‌మెన్ భాగస్వామ్య సంస్థలకు చెందిన వారు కూడా ఈ స్కీమ్​ ద్వారా రుణం పొందొచ్చు.
  • వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు కూడా ఈ పథకాన్ని అందిస్తారు.
  • జీతం తీసుకునే దరఖాస్తుదారు లేదా సహ-దరఖాస్తుదారుని నికర వార్షిక ఆదాయం 3 లక్షలు లేదా ఆపైన ఉండాలి.
  • వ్యవసాయం చేసే దరఖాస్తుదారు లేదా సహ దరఖాస్తుదారు నికర వార్షిక ఆదాయం రూ. 4 లక్షలు ఆపై ఉండాలి.

వడ్డీ రేటు: వడ్డీ రేటు 12.85% నుంచి 14.35%

కాల వ్యవధి: మీ ఇన్​స్టాల్​ మెంట్స్​కు అనుగుణంగా ఐదు సంవత్సరాల లోపు చెల్లించాలి.

SBI @23,000 బ్రాంచ్​లు- దేశంలోని అతి పెద్ద బ్యాంక్​ గురించి ఈ విషయాలు తెలుసా?

క్రెడిట్ కార్డ్​ స్టేట్​మెంట్​లో అవి చెక్​ చేయాల్సిందే - లేదంటే నష్టపోవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.