ETV Bharat / state

పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా? - వాటి గురించి తెలిస్తే అస్సలు పడేయరు - WATERMELON SEEDS BENEFITS IN TELUGU

పుచ్చకాయ విత్తనాలు తినడం లేదా - వాటివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Watermelon Seeds Benefits in Telugu
Watermelon Seeds Benefits in Telugu (EtTV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 5:03 PM IST

Watermelon Seeds Benefits in Telugu : వేడి నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా పుచ్చకాయలను తింటుంటారు. అలా తినేటప్పుడు చాలా మంది అందులో ఉన్న గింజలను పక్కకు పడేస్తుంటారు. మరి కొందరికీ ఆ గింజలు తినడమంటే చాలా చిరాకు. ఇంకొందరైతే గింజలు లేని పుచ్చకాయలనే ఇష్టపడుతుంటారు. కానీ వారందరికీ తెలియంది ఏమిటంటే? శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన పోషకాలు అన్ని పుచ్చకాయ గింజల్లో లభ్యమవుతాయని. పుచ్చకాయ కన్నా గింజలే ఎక్కువ ధర పలుకుతాయని ఎంతమందికి తెలుసు? అయితే ఈ పుచ్చకాయ గింజలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకుందాం.

పుచ్చకాయ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

  • రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, బి-విటమిన్‌ అందుతాయి.
  • జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.
  • జుట్టు చిట్లడం, రాలడం వంటి సమస్యలు నుంచి బయటపడతారు.
  • దంతాలకు, ఎముకలకు దృఢత్వం వస్తుంది.
  • చర్మం పొడిబారకుండా ఉంటుంది.
  • నరాల వ్యవస్థ బాగుటుంది.
  • వయసు రీత్యా వచ్చే చూపు సమస్యలను నివారించవచ్చు.
  • మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఈ గింజలు అల్జీమర్స్ ఇతర మానసిక రుగ్మతలు రాకుండా అడ్డుకుంటాయి.
  • వీటిని నానబెట్టి లేదా వేయించి తినవచ్చు. స్వీట్లు, సలాడ్స్​లో వేసుకోవచ్చు.
  • పుచ్చకాయ గింజలు తినడం వల్ల అధిక రోగనిరోధక శక్తి వస్తుంది. ఇందులో జింక్​, విటమిన్​-సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బూస్టర్​గా పని చేస్తాయి.
  • పుచ్చకాయలో ఉండే పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్​, విటమిన్స్, ఐరన్, ​ఆరోగ్యకరమైన కొవ్వులు, కాపర్​, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
  • పుచ్చగాయ గింజల్లో ఉండో మోనో అన్​శ్యాచురేటెడ్​, పాలీ అన్​శ్యాచురేటెడ్​ ఫ్యాటీ ఆమ్లాలు గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి. ఇవి తినడం వల్ల కొలెస్ట్రాల్​ పెరగదు. పుచ్చకాయ గింజలను తినడం వల్ల గుండె పని తీరు మెరుగుపడుతుంది.
  • వీటిని పుచ్చకాయను తిన్నప్పుడు కొందరు తింటారు. మరికొందరు ఎండబెట్టి తింటారు. ఇంకొందరు ఫ్రూట్స్​, సలాడ్స్​లో ఈ గింజలను తింటారు.

రోజూ మెంతులను ఇలా తీసుకున్నారంటే - షుగర్ కంట్రోల్, వెయిట్ లాస్​తో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

చలికాలంలో జలుబు, ఆస్తమా, కీళ్లనొప్పులు - ఉలవలతో ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.