Fire Accident At Kumbhmela : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సమీపంలోని పలు గుడారాలకు వ్యాపించాయి. ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot.
— ANI (@ANI) January 19, 2025
More details awaited. pic.twitter.com/dtCCLeVIlN
ప్రయాగ్‌రాజ్ డీఎం రవీంద్రకుమార్ చెప్పిన వివరాల ప్రకారం, 'సెక్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. సమీపంలోని 18 టెంట్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితి అదుపులో ఉంది.
Fire at #MahaKumbhMela2025 | Ravindra Kumar, DM, Prayagraj says, " the fire broke out at 4.30 pm in sector 19 in the tent of gita press. the fire spread to the nearby 10 tents. the police and administration team reached the spot. the fire has been extinguished. there is no… pic.twitter.com/YTx4QjGMF6
— ANI (@ANI) January 19, 2025
"మహా కుంభమేళాలోని సెక్టార్ 19లో మూడు సిలిండర్లు పేలి శిబిరాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు" అని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు. "చాలా విచారకరం! మహా కుంభ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తక్షణ సహాయక చర్యలు అందిస్తున్నారు. అందరి భద్రత కోసం మేం గంగమ్మను ప్రార్థిస్తున్నాం" అని కుంభమేళా నిర్వాహకులు పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆరా తీశారు. అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అయితే ఈ ఘటనలో మూడు సిలిండర్లు పేలినట్లు తెలిసిందని యూపీ మినిస్టర్ ఎకే శర్మ తెలిపారు. ప్రమాదం జరిగినా 20 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 100 మంది చుట్టుపక్కలే ఉన్నారని, వారికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.
#WATCH | Fire at #MahaKumbhMela2025 | Prayagraj | UP minister AK Sharma says, " ...i have met the officials and also the people in responsibility of gita press... i got the information that 3 cylinders were blasted and that led to the spread of the fire... the fire was brought… pic.twitter.com/yrDdgoF3Lk
— ANI (@ANI) January 19, 2025