Samsung Galaxy S25 Series: శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ మరికొద్ది రోజుల్లో లాంఛ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సిరీస్‌లోని స్మార్ట్ఫోన్లకు సంబంధించిన సమాచారం ఒక్కొక్కటిగా లీక్ అవుతోంది. ఈ మేరకు వీటి డిజైన్, స్పెసిఫికేషన్లు, ధరతో పాటు కలర్ ఆప్షన్లపై సమాచారం కూడా ఇప్పటికే చాలాసార్లు లీక్‌లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల వివిధ స్టోరేజ్ ఆప్షన్లతో కూడిన S25 సిరీస్ వేరియంట్స్ ధరలు రిలీజ్ అయ్యాయి. S24 సిరీస్ కంటే ఈ కొత్త సిరీస్ ధర ఎక్కువగా ఉంటుందని కొత్త టిప్‌స్టర్ లీక్ చేసింది.
S25 సిరీస్‌ను జనవరి 22న కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగే శాంసంగ్ వార్షిక ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ లైనప్‌లో 'గెలాక్సీ S25', 'S25 ప్లస్', 'S25 అల్ట్రా' మోడల్స్ వస్తున్నాయి. ఇక వీటి ధరల విషయానికొస్తే స్పిల్ సమ్ బీన్స్ నివేదికల ప్రకారం ఇవి కింది విధంగా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S25 మోడల్ ధర:
- 'గెలాక్సీ S25' బేస్ మోడల్ 256GB వేరియంట్ ధర: VND 23,990,000 (దాదాపు రూ. 81,800)
- 'గెలాక్సీ S25' 512GB వేరియంట్ ధర: VND 27,490,000 (దాదాపు రూ. 93,900)
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర:
- 'S25 ప్లస్' మోడల్ 256GB వేరియంట్ ధర: VND 27,990,000 (సుమారు రూ. 95,400)
- దీని 512 GB వేరియంట్ ధర: VND 31,490,000 (సుమారు రూ. 1,07,400)
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర: ఈ మోడల్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది.
- 'గెలాక్సీ S25' 256GB వేరియంట్ ధర: VND 34,990,000 (సుమారు రూ. 1,19,300)
- 'గెలాక్సీ S25' 512GB వేరియంట్ ధర: VND 38,490,000 (సుమారు రూ. 1,31,300)
- ఇక దీని 1TB వేరియంట్ ధర: VND 45,790,000 (సుమారు రూ. 1,56,300)
స్పిల్ సమ్ బీన్స్ నివేదికలు అప్‌కమింగ్ 'S25' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధర 'S24' లైనప్ కంటే ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధరల విషయానికొస్తే..
గెలాక్సీ S24 మోడల్ ధరలు:
- 'గెలాక్సీ S24' బేస్ మోడల్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 79,999
- 'గెలాక్సీ S24' 512GB వేరియంట్ ధర: రూ. 89,999
గెలాక్సీ S24 ప్లస్ మోడల్ ధరలు:
- 'S24 ప్లస్' 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.99,999
- 'S24 ప్లస్' 512GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.1,09,999
గెలాక్సీ S24 అల్ట్రా మోడల్ ధరలు:
- 'S24 అల్ట్రా' 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 1,29,999
- 'S24 అల్ట్రా' 512GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 1,39,999
- 'S24 అల్ట్రా' 1TB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,59,999
ఇదిలా ఉండగా శాంసగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్‌లలో కొన్ని మోడల్ ధరలు గణనీయంగా తగ్గాయి. మరికొన్ని రోజుల్లో రాబోతున్న 'రిపబ్లిక్ డే'ను పురస్కరించుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో శాంసంగ్ S-సిరీస్ స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో శాంసంగ్ 'S24' సిరీస్ ధర రూ. 50,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.56,974.
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై మీ స్టేటస్ మరింత ఎట్రాక్టివ్‌గా!
యాపిల్ సంచలన నిర్ణయం- ఏఐ జనరేటెడ్ ఎర్రర్-ప్రోన్ ఫీచర్ తొలగింపు!
మస్క్ స్పేస్ఎక్స్ ప్రయోగం విఫలం- లాంఛైన కాసేపటికే పేలిపోయిన రాకెట్!- వీడియో వైరల్