2025 BMW X3 SUV Launched: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తన X3 SUVలో కొత్త వెర్షన్‌ను లాంఛ్ చేసింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ ఈ X3 కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది.
వేరియంట్లు: ఈ ఫోర్త్ జనరేషన్ BMW X3 SUVని రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు.
- X3 20
- X3 20D
వీటిలో X3 20 అనేది పెట్రోల్ వేరియంట్. ఇక X3 20D డీజిల్ వేరియంట్.
డిజైన్: ఈ కొత్త BMW X3 SUV డిజైన్ పరంగా ప్రీవియస్ మోడల్‌తో పోలిస్తే దీన్ని చాలా మార్పులతో విడుదల చేశారు. ఇది ఫ్రంట్ బంపర్, కిడ్నీ గ్రిల్‌తో వస్తుంది. వీటితో పాటు దీనిలో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ L- ఆకారపు DRLలతో సొగసైన LED హెడ్‌లైట్‌లు, వెనకవైపు Y- ఆకారపు LED టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి.
ఇంటీరియర్: ఈ BMW X3 SUV కొత్త వెర్షన్ ఇంటీరియర్ డిజైన్‌ను పరిశీలిస్తే, BMW సరికొత్త iDrive9 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో అందించారు. ఇది కాకుండా ఇందులో ఫ్లాట్- బాటమ్ స్టీరింగ్, హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, కనెక్టెడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంజిన్: ఈ అప్డేటెడ్ నయా మోడల్‌లో 2-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. దీని పెట్రోల్ ఇంజిన్ 206 bhp పవర్, 310 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో దీని X3 20D డీజిల్ వేరియంట్ 197bhp శక్తిని, 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
ధర: ఈ నయా మోడల్ ధరను కంపెనీ రూ.75.8 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
మార్కెట్లో దీని ప్రత్యర్థులు: ఈ లగ్జరీ X3 SUVకి మార్కెట్లో ప్రధాన పోటీదారులు మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 వంటి మోడల్స్.
కాగా దేశంలోనే అతిపెద్ద 'ఆటో ఎక్స్‌పో'ను ప్రధాని మోదీ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. దిల్లీలోని భారత్ మండపంలో ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రగతి మైదాన్, ద్వారక, గ్రేటర్ నోయిడా అనే మూడు ప్రదేశాలలో 5 రోజుల పాటు ఈ కార్ ఫెయిర్ జరగనుంది.
ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొని తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఆటో ఎగ్జిబిషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా 100 కి పైగా కొత్త వాహనాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్ ఫెయిర్ జనవరి 22 వరకు కొనసాగనుంది.
సామాన్యులు సైతం ఈ ఫెయిర్‌లో పాల్గొని వీక్షించొచ్చు. అయితే సాధారణ వ్యక్తులకు ఎంట్రీ అవకాశం ఎప్పుడు? ఇందుకోసం ఏం చేయాలి? ఈ ఐదు రోజుల్లో ఈ కార్ ఫెయిర్ ప్రతిరోజూ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? వంటి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐఫోన్ SE 4 ఫస్ట్ గ్లింప్స్ లీక్- డిజైన్, స్పెక్స్, ధర వివరాలివే!
వామ్మో.. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధరలు చూశారా?- జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయ్‌గా!
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై మీ స్టేటస్ మరింత ఎట్రాక్టివ్‌గా!