Gen Z Passive Income Ways : నేటి యువత చాలా తెలివిగా డబ్బులు సంపాదిస్తోంది. అంతేకాదు డబ్బుతో పనిచేయించి మరింత డబ్బును గడిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తాము నిద్రపోతూ కూడా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పాసివ్ ఇన్కమ్‌ను సంపాదిస్తోంది. అది ఎలాగో తెలుసా?
డిజిటల్ కంటెంట్ క్రియేషన్
నేటి యువత సోషల్ మీడియాను పెద్ద ఆదాయ మార్గంగా మలుచుకుంటోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో తమ కంటెంట్‌ను అప్లోడ్ చేసి, పెద్ద ఎత్తున యూజర్లను, సబ్‌స్క్రైబర్లను పొందుతున్నారు. భారీ స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రకటనల ద్వారా, బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. తమ యూజర్ల అభిరుచికి అనుగుణంగా కంటెంట్ క్రియేట్ చేస్తూ, పాసివ్ ఇన్కమ్‌ను ఆర్జిస్తున్నారు.
అఫిలియేట్ మార్కెటింగ్
చాలా మంది తమ యూట్యూబ్ ఛానల్స్, బ్లాగ్స్, వెబ్‌సైట్‌ల ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. రిఫరల్ లింక్స్ ఇచ్చి, కమిషన్ల రూపంలో పాసివ్ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఆన్‌లైన్ కోర్సులు, ఈ-పుస్తకాలు
యువత తమ టాలెంట్‌ను ఉపయోగించుకుని ఆన్‌లైన్ కోర్సులు క్రియేట్ చేస్తున్నారు. ఈ-పుస్తకాలు విక్రయిస్తున్నారు. వీటి ద్వారా తమ స్టూడెంట్స్‌కు జ్ఞానం పంచుతూనే, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.
డివిడెండ్ ఇన్వెస్టింగ్
చాలా మంది యువత మంచి డివిడెండ్ అందించే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటి ద్వారా డివిడెండ్ రూపంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని గుర్తుంచుకోవాలి.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు
నేటి యువత స్థిరాస్తి రంగంలోనూ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇళ్లు ద్వారా అద్దె రూపంలో ఆదాయం సంపాదిస్తున్నారు. మంచి లాభాలకు సైట్‌లను అమ్మి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలంటే, ముందుగా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది.
కానీ ఈ తప్పు చేయవద్దు!
చాలా మంది యువతీయువకులు తాము కోరుకున్న రంగంలో లేదా ఉద్యోగంలో కొనసాగుతూనే, ఖాళీ సమయాల్లో అదనపు సంపాదన మార్గాలను చూసుకుంటున్నారు. ముఖ్యంగా పాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి విషయమే కానీ కొంత మంది రెగ్యులర్ పనిని మానేసి, రిస్క్ తీసుకుంటున్నారని, దీని వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కెరీర్ కౌన్సిలింగ్ నిపుణులు చెబుతున్నారు. కనుక తస్మాత్త్ జాగ్రత్త!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలా? ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ బెస్ట్ ఆప్షన్స్!
ఫ్రీలాన్సర్‌గా పనిచేయాలనుకుంటున్నారా? టాప్ 10 ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ ఇవే!