ETV Bharat / state

'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్ - KTR TO APPROACH HC OVER E CAR RACE

తెలంగాణను ఎలక్ట్రిక్‌ వాహనాలకు హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ నిర్వహించామన్న కేటీఆర్​ - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తామని ప్రకటన

KTR To KTR to approach High Court over Formula E racing case
KTR To KTR to approach High Court over Formula E racing case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 14 minutes ago

KTR On Formula E racing case : రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలకు హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ నిర్వహించామని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీపీ) తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు.

హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ కార్ రేస్ జరపాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్న కేటీఆర్ 2001లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేస్ నిర్వహించేందుకు యత్నించారని తెలిపారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఫార్ములా- ఈ కార్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరామని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల మధ్య చర్చ పెడదాం అని స్పీకర్‌ను కోరానన్న ఆయన ఫార్ములా- ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

అసెంబ్లీలో ఈ కార్​ అంశంపై చర్చ పెట్టాలి : ఫార్ములా- ఈ కార్ అంశంలో అక్రమాలు చేశామని ప్రభుత్వం అంటుందన్న కేటీఆర్​ వాటిని నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రోజుకో అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టి సమగ్రంగా చర్చించాలని సవాల్ విసిరారు.

ఫార్ములా-1 రేస్​ ట్రాక్​ కోసం గోపన్​పల్లిలో భూసేకరణ జరిగిందని కేటీఆర్​ తెలిపారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉందని వివరించారు. ఎఫ్​-1 చుట్టూ నగరాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎఫ్​-1 రేస్​ల నిర్వహణకు దేశవ్యాప్త పోటీ ఉందని కేటీఆర్​ అన్నారు. చంద్రబాబు 2001లో జినోమ్​వ్యాలీని ఏర్పాటు చేశారని కేటీఆర్​ గుర్తు చేశారు. నాడు ఏర్పాటు చేసిన జినోమ్​ వ్యాలీ ఇప్పుడు ఉపయోగపడుతుందన్నారు.

ఈవీలకు హబ్​గా మార్చాలనేది మా ప్రణాళిక : 'ఎలక్ట్రికల్‌ వాహనాలకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చాలనేది మా ప్రణాళిక అని కేటీఆర్ తెలిపారు. రేసింగ్‌ ద్వారా ఈవీ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించాలనేది తమ ఆలోచన అని.. అందుకే వరుసగా 4 సీజన్లు ఫార్ములా- ఈ కార్ రేస్‌ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నట్లు కేటీఆర్​ తెలిపారు.

"హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే ఫార్ములా ఈ – రేసింగ్‌ నిర్వహించాం. నిర్వాహకులకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు చెల్లించింది వాస్తవం. హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్లు తీసుకున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. డబ్బు ఇచ్చినవాళ్లు, తీసుకున్న వాళ్లు ఒప్పుకున్నాక అవినీతి ఎక్కడ. సెన్స్‌ ఫీజు రూ.74 లక్షలు వాపస్‌ పంపుతూ ఎఫ్‌ఎంఎస్‌ఏ వాళ్లు లేఖ రాశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది. హైదరాబాద్‌లో ఈవెంట్లకు మరోసారి నిర్వాహకులు ముందుకు రారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు కూడా కేసు పెడతారు. నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు. న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం" - కేటీఆర్​, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

మరోవైపు ఫార్ములా ఈ రేసింగ్​ కేసుపై కేటీఆర్​ హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. రేపు హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయనున్నారని తెలిసింది.

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​లో అసలేం జరిగింది? - ఏసీబీ విచారణలో ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది?

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసు - ఏ1గా కేటీఆర్‌

Last Updated : 14 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.