LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA LEGISLATIVE COUNCIL LIVE
🎬 Watch Now: Feature Video
Published : 2 hours ago
Telangana Legislative Council Live : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయిదో రోజు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శాసన మండలి మొదలవుతుంది. అయితే ఇవాళ పలు అంశాలు శాసనసభలో చర్చకు వస్తుండడంతో ప్రతిపక్షం, అధికారపక్షం ఇరు పక్షాలు తమ వాదనలను గట్టిగా వినిపించే అవకాశం ఉంది. రైతు భరోసా విధివిధానాలపై, భూ భారతి చట్టంపై ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్ర ఉభయసభలు ఇవాళ వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాలు తరువాత తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్‌కు చెందిన గత ఆర్థిక ఏడాది వార్శిక నివేదిక అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశ పెడతారు. ఆ తరువాత "భూ భారతి'' బిల్లుపై చర్చ ఇవాళ కూడా కొనసాగుతుంది. తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెడతారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సవరణ బిల్లు కూడా సీఎం రేవంత్ రెడ్డినే సభ ముందు ఉంచుతారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశ పెడతారు. ఆ తరువాత రాష్ట్ర అప్పులు, రైతు భరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.