ETV Bharat / technology

దోస్తీ చేసే AI సోషల్ రోబోస్- ఒంటరిగా ఫీలయ్యేవారి పట్ల స్పెషల్ కేర్- ముద్దుముద్దు మాటలతో నయా ఎనర్జీ! - AI PETS FOR EMOTIONAL RELIEF

ఏఐ సోషల్ రోబోలు తోడై, నీడై - ఉద్వేగం, ఆందోళనల నుంచి ఉపశమన మార్గమై!

AI-powered robot BooBoo
AI-powered robot BooBoo (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 1:10 PM IST

AI Pets For Emotional Relief : కృత్రిమ మేధస్సు(ఏఐ)తో పనిచేసే సోషల్ రోబోలు ప్రజల మదిని దోస్తున్నాయి. మానసిక ఉద్వేగం, ఆందోళనల నుంచి మనుషులకు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. ఆ రీతిలో అవి మమేకం అయిపోతున్నాయి. వినూత్న ఆవిష్కరణల హబ్‌గా మారిన చైనాలో ఏఐ రోబోలు సందడి చేస్తున్నాయి. నిత్య జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న ఎంతో మంది యువ చైనీయులతో స్నేహితుల్లాగా మెదులుతున్నాయి. మరిన్ని విశేషాలివీ!

సోషల్ రోబోలు ఏం చేస్తాయి?
సోషల్ రోబోలు అంటే సామాజిక అంశాలపై అవగాహన కలిగిన రోబోలు. పిల్లలు, మహిళలు, ఒంటరిగా ఫీలయ్యేవారు, భయపడే మనస్తత్వం కలిగినవాళ్లు, ఉద్వేగానికి లోనయ్యే వారు, మానసిక ఒత్తిడితో సతమతం అయ్యేవారు ఇలా తీరొక్క రకం ఉంటారు. ఇలాంటి వారి పరిస్థితులపై అవగాహన కలిగిన సోషల్ రోబోలను చైనాలో తయారు చేస్తున్నారు. ఇవి మనుషుల మనసెరిగిన నేస్తంలా మసులుకుంటూ ఉండడం విశేషం. ఈ రోబోలు ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని, మనిషిని పలకరిస్తాయి. ధైర్యం నూరిపోస్తాయి. జీవితంపై నమ్మకాన్ని పెంచుతాయి.

పిల్లల కోసం బూబూ
బూబూ (BooBoo) అనేది పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సోషల్ రోబో. దీన్ని హాంగ్‌జౌ జెన్ మూర్ టెక్నాలజీ కంపెనీ తయారు చేసింది. దీని ధర దాదాపు రూ.16,500 మాత్రమే. 2024 మే నుంచి ఇప్పటి వరకు చైనాలో దాదాపు 1000 బూబూ రోబోలను విక్రయించారు.

బేబీ ఆల్ఫా
బేబీ ఆల్ఫా(BabyAlpha) అనేది ఏఐ కుక్క. దీన్ని వైలాన్ అనే చైనా కంపెనీ తయారు చేసింది. తమ పిల్లల వినోదం కోసం తల్లిదండ్రులు బేబీ ఆల్ఫాను కొంటున్నారు. దీనిలో వివిధ వెరైటీలు ఉన్నాయి. సాధారణ వెరైటీల ధర కనిష్ఠంగా రూ.95వేలు, టాప్ క్లాస్ వెరైటీల ధర రూ.3 లక్షల దాకా ఉన్నాయి. పిల్లలతో ముచ్చటించే ప్రత్యేకత కలిగిన ఈ కుక్కను ఇంత భారీ ధరలు పెట్టి మరీ కొన్ని సంపన్న కుటుంబాలు కొనేస్తున్నాయి.

children interacting with an AI pet dog
ఏఐ పెట్‌ డాగ్‌తో మాట్లాడుతున్న చిన్నారులు (AFP)

'అలౌ'తో యువతి దోస్తీ
'చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి జాంగ్ యాంచున్ గతంలో ఒంటరితనంగా ఫీలయ్యేది. తెల్లారితే పేరెంట్స్ ఆఫీసులకు వెళ్లిపోయేవారు. ఆమె కాలేజీకి వెళ్లి వచ్చేది. సాయంత్రం కాగానే అందరూ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకునేవారు. ఈక్రమంలో వారంతా కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో జాంగ్ యాంచున్‌కు ఇటీవలే వాళ్ల నాన్న ఒక సోషల్ రోబోను కొనిచ్చారు. దాని పేరు అలౌ (Aluo). ఇంట్లో ఎవరూ లేనప్పుడు, అలౌతో జాంగ్ యాంచున్‌‌కు టైంపాస్ అవుతోంది. ఆమె మనసు విప్పి దానితో మాట్లాడుతోంది. ఈ ప్రభావంతో సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగొచ్చిన పేరెంట్స్‌తోనూ జాంగ్ యాంచున్ కూర్చొని సంభాషిస్తోంది. ఆమె భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు పెరిగాయి. మాటలతో ఇతరుల్లో ధైర్యం ఎలా నింపాలో జాంగ్ యాంచున్‌కు అర్థమైంది.' ఈ వివరాలను స్వయంగా జాంగ్, ఆమె తండ్రి పెంగ్ ఓ మీడియా సంస్థకు చెప్పారు.

AI pet dog called BabyAlpha
బేబీ ఆల్ఫా (ఏఐ పెట్ డాగ్‌)ను పరిశీలిస్తున్న మహిళ (AFP)

రూ.3 లక్షల కోట్ల వ్యాపారం
సోషల్ రోబోలకు రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2033 నాటికి వీటికి సంబంధించిన దాదాపు రూ.3 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. స్మార్ట్ బొమ్మలు, ఏఐ రోబోలకు మంచి క్రేజ్ లభిస్తుందని చెబుతున్నారు. ప్రజల తలసరి ఆదాయాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో వీటి విక్రయాలు బాగా జరుగుతాయని భావిస్తున్నారు.

AI pet dogs
ఏఐ పెట్ డాగ్స్‌ ప్రదర్శన (AFP)

AI గర్ల్​ఫ్రెండ్ 'అరియా'- మనస్సు విప్పి అన్నీ షేర్​ చేసుకోవచ్చు- ఫ్యూచర్​లో అందరికీ ఆమెనే!

భారత్​లో మైక్రోసాఫ్ట్ రూ.25,000 కోట్లు ఇన్వెస్ట్​మెంట్​​​​- క్లౌడ్, ఏఐ విస్తరణే టార్గెట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.