Kannappa Movie Akshay Kumar : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నార్త్ టు సౌత్ వరకు పలువురు స్టార్స్ భాగం అవుతున్నారు. 'మహాభారత్' సిరీస్ తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన లుక్ పరిచయం చేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో త్రిశూలం, డమరకంతో అక్షయ్ గంభీరంగా కనిపించారు. దీంతో శివయ్య లుక్‌లో అక్షయ్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజా పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 'ముల్లోకాలు ఏలే పరమేశ్వకుడు, భక్తికి మాత్రం దాసుడు' అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ఇక పోస్టర్లో అక్షయ్ శివతాండవం ఆడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. త్రిశూలం, నీలకంఠం, ఢమరుకం ఇలా అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఇక గత వారం కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. పార్వతీ దేవీగా కాజల్‌ను చూపించారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నారు
ॐ The Eternal Protector ॐ
— Kannappa The Movie (@kannappamovie) January 20, 2025
Unveiling @akshaykumar as *𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, a captivating presence of divinity, power, and serenity in #Kannappa🏹.✨
Dive into the ageless story of unwavering love, devotion, and sacrifice.
Experience the grandeur on the big screen this April… pic.twitter.com/CQlB89EaDQ
నంది పాత్రలో ప్రభాస్
కన్నప్ప సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎక్కువ భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్ చేయడానికి గల కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో మేకర్స్ తెలియజేశారు. కన్నప్ప సినిమా మూడో శతాబ్ద కాలం నాటిదని, ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్ లో షూటింగ్ చేశామని పేర్కొన్నారు.
సినిమా విషయానికొస్తే, మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఏప్రిల్ 25న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ - 'కన్నప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్
'కన్నప్ప' ఫైటర్ భామపై అందరి కళ్లు- ఈ ముద్దుగుమ్మ ఎవరంటే? - Kannappa Movie Heroine