Lucknow Super Giants Captain 2025 : టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి ఎంపికను ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా సోమవారం ఖరారు చేశారు. పంత్‌సహా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజీవ్ ఈ ప్రకటన చేశారు. భవిష్యత్‌లో పంత్ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా ఎదుగుతాడని సంజీవ్ నమ్మకం వ్యక్తం చేశారు.
కాగా, 2025 మెగా వేలంలో పంత్‌ను లఖ్‌నవూ రూ.27 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఇక పంత్ కంటే ముందు లఖ్‌నవూ జట్టుకు కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్ నాయకత్వం వహించారు. మరోవైపు పంత్ గతంలో 2021, 2022, 2024 సీజన్లలో దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు.
Sanjeev Goenka said - “Rishabh Pant is going to be The best Captain ever in IPL history in future”. pic.twitter.com/KGd4eDF5QO
— Tanuj Singh (@ImTanujSingh) January 20, 2025