ETV Bharat / technology

భారత మార్కెట్లోకి MG ZS HEV!- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? - MG ZS HEV AT AUTO EXPO 2025

ఆటో ఎక్స్​పో 2025లో MG ZS HEV- ఇదేనా ఆస్టర్ ఫేస్​లిఫ్ట్?

MG ZS HEV
MG ZS HEV (Photo Credit- MG Motor)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 20, 2025, 3:04 PM IST

MG ZS HEV at Auto Expo 2025: JSW MG మోటార్ ఇటీవల గ్లోబల్​గా లాంఛ్ చేసిన 'MG ZS HEV' కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. కంపెనీ దీన్ని 'MG ఆస్టర్' పేరుతో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఈ కొత్త మోడల్​తో ప్రస్తుతం ఉన్న 'MG ఆస్టర్'ను భర్తీ చేయనుంది. తద్వారా మార్కెట్​లోని ఇతర కాంపాక్ట్ SUV ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. అయితే కంపెనీ ఈ నయా మోడల్​ పవర్​ట్రెయిన్​పై ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో దీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ గురించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.

MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్: ఈ కొత్త MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ కంటే మరింత అప్డేటెడ్, ప్రీమియం లుక్​తో వస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్ మునుపటి కంటే పెద్దదిగా, మరింత విశాలంగా ఉంటుంది. ఈ కారు పైభాగంలో క్రోమ్ స్లాట్​లతో చిన్న విభాగం ఉంది. దాని పైన పెద్దగా MG లోగో కన్పిస్తుంది. సెంటర్ గ్రిల్ సైడ్స్​లో రెండు C-ఆకారపు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కొంచెం అగ్రెసివ్ లుక్​లో కన్పిస్తాయి.

కారులో అమర్చిన హెడ్‌లైట్లు ఎప్పటిలాగానే ట్రెడీషనల్ టైప్​లోనే ఉంటాయి. అయితే ఇక్కడ మనకు LED DRLతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ లభిస్తుంది. ఈ SUVకి మంచి ఆకర్షణీయమైన లుక్​ అందించేందుకు సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్​ను కింది భాగంలో ఏర్పాటు చేశారు. మొత్తంమీద ఈ కారు అదే పాత సిల్హౌట్‌ను కలిగి ఉంది. కానీ దీనికి లార్జెర్ క్వార్టర్ గ్లాస్, మరింత స్టైలిష్ అల్లాయ్ వీల్ డిజైన్ ఉంది. అయితే దీని ORVMలు, బాడీ క్లాడింగ్ వంటి ఇతర ఎలిమెంట్స్​ ప్రస్తుత మోడల్‌ని పోలి ఉంటాయి.

MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్: కారు వెనక భాగంలో సరికొత్త విండ్‌స్క్రీన్ ఉంది. ఇది ప్రస్తుత MG ఆస్టర్ కంటే పెద్దదిగా, తక్కువ గుండ్రటి సైజ్​లో ఉంటుంది. దీని LED టెయిల్ లైట్లు, దిగువ రిఫ్లెక్టర్లు మునుపటి కంటే మంచి లుక్​లో అందించారు. ఇక ఈ కారు వెనక బంపర్.. సిల్వర్ ఫినిషింగ్, ట్విన్ ఎగ్జాస్ట్‌లతో స్ప్లిట్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది. అయితే దీని రియల్ ఎగ్జాస్ట్ బంపర్ వెనక ఉంటుంది.

MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్: దీని ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ కారుకు లంబోర్గిని లాంటి AC వెంట్స్​తో కొంగొత్త డ్యాష్​బోర్డ్​​ను అందిచారు. దీని డ్యాష్​బోర్డ్​లో 12.3-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. ఇది తక్కువ ఎత్తుతో ఉంటుంది. కానీ దీని వెడల్పు మాత్రం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో కొత్తగా స్టీరింగ్ వీల్, 7-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే సెంటర్ కన్సోల్‌లో అధునాతన యాచ్ లాంటి గేర్ సెలెక్టర్ కూడా ఉంది.

ఇతర ఫీచర్లు: ఈ నయా కారు ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, ADAS సూట్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనక AC వెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, విలాసవంతమైన సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌ వంటివి ఉన్నాయి.

MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్ పవర్​ట్రెయిన్: కొత్త MG ఆస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుందని అంచనా. అయితే ప్రస్తుతం దీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

ఇండియాలోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ ఎంట్రీ- వచ్చీ రాగానే అదిరే ఈవీ కార్లతో సంచలనం!

ఐఫోన్ SE 4 ఫస్ట్ గ్లింప్స్ లీక్- డిజైన్, స్పెక్స్​, ధర వివరాలివే!

వామ్మో.. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​ ధరలు చూశారా?- జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయ్​గా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.