ETV Bharat / entertainment

@1500 కోట్లు - ​కమర్షియల్‌ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన 'పుష్ప 2' - PUSHPA 2 THE RULE 1500 CRORES

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' లేటెస్ట్ కలెక్షన్స్ వివరాలివే!

Pushpa 2 The Rule 1500 Crore Collections
Pushpa 2 The Rule 1500 Crore Collections (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Pushpa 2 The Rule 1500 Crore Collections : ఇండియన్ సినిమా హిస్టరీలో కమర్షియల్‌ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది పుష్ప 2 : ది రూల్‌. బాక్సాఫీస్‌ భారీ వసూళ్లను అందుకునే విషయంలో పుష్ప రాజ్‌ వాయువేగంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ఈ మూవీ

కేజీయఫ్‌ 2 (రూ.1250 కోట్లు), RRR (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ రికార్డ్ కలెక్షన్లు అధిగమించిన పుష్ప 2, బాహుబలి 2 (రూ.1810 కోట్లు) వసూళ్లను అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. కాగా, ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ఇండియన్ సినిమాల జాబాతాలో ఆమిర్‌ఖాన్‌ దంగల్‌ (రూ.2,024 కోట్లు) అగ్రస్థానంలో ఉంది.

అలానే ముంబయి సర్క్యూట్‌లో రూ.200 కోట్లు (నెట్‌) సాధించిన తొలి సినిమాగానూ పుష్ప 2 రికార్డు సృష్టించింది. మొత్తంగా ఇప్పుడు హిందీలో రూ.618.50 కోట్లు (నెట్‌) వసూలు చేసింది.

రూ.2 వేల కోట్లు సాధ్యమేనా?

ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్లు చూస్తుంటే వసూళ్ల ఇది సాధ్యమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో పలు తెలుగు చిత్రాలు రానున్నాయి. వాటి ఫలితం పుష్ప 2 వసూళ్లపై ప్రభావం చూపించొచ్చు. మరోవైపు బాలీవుడ్‌లో డిసెంబరు 25 వరకూ పెద్ద సినిమాలేమీ లేవు. క్రిస్మస్‌ కానుకగా వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ నటించిన 'బేబీ జాన్‌' రానుంది. అంటే మరికొన్ని రోజులు నార్త్‌ బాక్సాఫీస్ ముందు పుష్పరాజ్‌దే హవా ఉంటుంది. మరోవైపు, ఓవర్సీస్‌లోనూ పుష్ప 2 మంచి వసూళ్లను సాధిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.