Car Sell Documents : మీ పాత కారును అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో పాత కారును అమ్మాలంటే కొన్ని కీలక పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) : కారు కొనేటప్పుడు మీ పేరున దానిని కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్‌టీఓ కార్యాలయం మీకు ఆర్‌సీ జారీ చేస్తుంది. అప్పుడే మీరు సదరు వాహనానికి నిజమైన యజమాని అవుతారు. అలాగే మీరు ఆ కారును తిరిగి అమ్మేటప్పుడు కూడా ఈ ఆర్‌సీని చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌సీ మీ పేరున లేకపోతే, దానిని ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టమవుతుంది.
- ఫారమ్ 29 : కారును అమ్మేటప్పుడు ఆర్‌టీఓ ఆఫీస్‌లో కచ్చితంగా ఫారమ్ 29ని సమర్పించాలి. అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా యాజమాన్య బదిలీ (ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్) జరుగుతుంది.
- ఫారమ్ 28 : కారుపైన ఎలాంటి అప్పులు, బకాయిలు లేవని నిర్ధరిస్తూ తెలియజేసే 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (ఎన్‌ఓసీ) ఇది.
- ఫొటోగ్రాఫ్స్ : కారు అమ్మేటప్పుడు మీ సెల్ఫ్ అటాస్టెడ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.
- ఫారమ్ 30 : ఇది కారు యాజమాన్య బదిలీకి కావాల్సిన మరో కీలక పత్రం. ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్‌ని వెంటనే ప్రారంభించాలని ఇది ఆర్‌టీఓకు తెలియజేస్తుంది.
- అడ్రస్ ప్రూఫ్ : మీ చిరునామా వివరాల కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటివి సమర్పించవచ్చు. అయితే వీటికి కూడా సెల్ఫ్ -అటాస్టేషన్ తప్పనిసరి.
- పాన్ కార్డ్ : మీరు పన్ను ప్రయోజనాలు పొందాలంటే, కచ్చితంగా సెల్ఫ్-అటాస్టెడ్ పాన్ కార్డ్‌ను సమర్పించాలి.
- కార్ ఇన్సూరెన్స్ : కారు యాజమాన్య బదిలీకి తప్పనిసరిగా యాక్టివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఒక వేళ ఇప్పటికీ మీ కారు బీమా పాలసీ ముగిసినట్లయితే, వెంటనే దానిని పునరుద్ధరించుకోవాలి. లేదా లీగల్ ఇష్యూస్ రాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
- పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUC) : మీ కారు ఉద్గారాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లుగా నిర్ధరిస్తూ ఇచ్చే పీయూసీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
మంచి ఎలక్ట్రిక్ బైక్/ కార్ కొనాలా? ఈ టాప్-5 టిప్స్ మీ కోసమే!
మీ కారును సర్వీసింగ్‌కు ఇవ్వాలా? ఈ స్కామ్స్ విషయంలో జర జాగ్రత్త!