New Bajaj Chetak Electric Launched: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ తయారీ సంస్థ బజాజ్ ఆటో తన సరికొత్త 'బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్'ను లాంఛ్ చేసింది. అదిరే ఫీచర్లతో దీన్ని మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. 'చేతక్ 35' సిరీస్‌లో '3501', '3502' పేర్లతో రెండు వెర్షన్లను తీసుకొచ్చింది. వీటిలో '3501' అనేది టాప్-స్పెక్ వెర్షన్. కంపెనీ ఈ ప్రీమియం మోడల్‌ను రూ. 1.27 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. '3502' అనేది మిడ్ రేంజ్ వేరియంట్. ఇక దీని ధరను రూ.1.20 లక్షల ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించింది. అయితే ఈ సిరీస్‌లో '3503' బేస్ వేరియంట్‌ను త్వరలో తీసుకురానున్నారు.
రేంజ్ అండ్ పెర్ఫార్మెన్స్: ఈ కొత్త బజాజ్ చేతక్‌ను కొత్త ఫ్రేమ్‌పై నిర్మించారు. దీన్ని 3.5kWh బ్యాటరీతో తీసుకొచ్చారు. దీన్ని ఫ్రోర్బోర్డ్ కింద అమర్చారు. 3 కిలోల బరువున్న ఈ ఈ కొత్త బ్యాటరీ.. 153 కిలోమీటర్ల హై రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ 950W ఛార్జర్‌తో వస్తుంది. దీనితో ఈ స్కూటర్‌ను మూడు గంటల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ కొత్త బజాజ్ చేతక్ దాని ప్రీవియస్ మోడల్ల్ మాదిరిగానే ఎక్విప్మెంట్స్తో వస్తుంది. ఇందులో 4kW ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. కంపెనీ క్లెయిమ్ చేసినట్లుగా దీని పెర్ఫార్మెన్స్ పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని టాప్ టూ మోడల్స్ టాప్ స్పీడ్ 73kph. దీని బేస్ 3503 మోడల్ గరిష్ట వేగం 63kph. అయితే ఈ మోడల్‌ను కంపెనీ ఇంకా తీసుకుని రాలేదు. కంపెనీ త్వరలోనే దీన్ని రిలీజ్ చేయనుంది.
కొత్త బజాజ్ చేతక్ డిజైన్: కంపెనీ దీని బ్యాటరీని స్కూటర్ ఫ్లోర్‌పై అమర్చింది. దీనివల్ల దీని బూట్‌స్పేస్ మరింత పెరిగింది. ఇంతకుముందు దీని పాత మోడల్ చేతక్‌పై ఈ విషయంలోనే కంప్లైంట్స్ వచ్చాయి. కానీ కంపెనీ ఈ కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆ సమస్యను పరిష్కరించి తీసుకొచ్చింది. దీంతో ఇది 35-లీటర్ బూట్ స్పేస్‌తో వస్తుంది. వీల్‌బేస్ కూడా 25 mm నుంచి 1,350 mm వరకు పెరిగింది. వీటితోపాటు దీని సీటు ఇప్పుడు 80 mm పొడవుతో వస్తుంది.
ఇతర ఫీచర్లు: ఈ కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ టాప్-స్పెక్ 3501 వేరియంట్‌లో చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్‌తో TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో డాక్యుమెంట్ స్టోరేజ్, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ వార్నింగ్, ఓవర్ స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వారెంటీ: బజాజ్ ఆటో కొత్త చేతక్‌తో 3 సంవత్సరాలు/50,000 కిమీ వారంటీని అందిస్తోంది. ఇప్పటి వరకు బజాజ్ కేవలం రెండు వేరియంట్ల ధరలను మాత్రమే ప్రకటించింది. దీని బేస్ 3503 వేరియంట్ ధర త్వరలో వెల్లడించనుంది. బజాజ్ చేతక్ ప్రస్తుతం మార్కెట్లో TVS iCube, Ather Rizta, Ampere Nexus, Ola S1 రేంజ్ వంటి స్కూటర్లతో పోటీ పడుతోంది.
ఓపెన్ఏఐ మరో అద్భుతం.. ఇకపై వాట్సాప్‌తో పాటు ల్యాండ్లైన్లోనూ చాట్‌జీపీటీ..!- ఎలా ఉపయోగించాలంటే?
సూపర్ ఫీచర్స్, 400 కి.మీ కంటే ఎక్కువ రేంజ్!- ఈ ఏడాది కస్టమర్లను ఫిదా చేసిన ఈవీ కార్లు ఏవో తెలుసా?