LIVE : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - TELANGANA ASSEMBLY LIVE
Published : 6 hours ago
Telangana Assembly Sessions 2024 Live : శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇవాళ తెలంగాణ భూభారతి బిల్లును ప్రవేశపెడుతోంది. ఆర్వోఆర్ చట్టం -2024ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు. ఉభయ సభలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉభయసభల్లో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు రెండు సభల్లోనూ సమాధానాలు ఇస్తున్నారు. ఆ తరువాత శాసన సభలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమువల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ సవరణ బిల్లు ప్రవేశ పెడతారు. ఆ తరువాత శాసన సభలో గురుకుల, ప్రభత్వ పాఠశాలలలో మౌళిక వసతుల కల్పనపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మండలిలో ఇవాళ క్రీడా బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, జిఎస్టీ సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెడతారు. అదేవిధంగా కౌన్సిల్‌లో పర్యాటక విధానంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.