LIVE : సికింద్రాబాద్ టు విశాఖ రెండో వందేభారత్ రైలు ప్రారంభోత్సవం - Vande Bharat Secunderabad toVizag
Published : Mar 12, 2024, 9:17 AM IST
|Updated : Mar 12, 2024, 10:04 AM IST
Second Vande Bharat Express Launch Live : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందేభారత్ రైలు నడవదు. మిగిలిన అన్ని రోజులు ప్రయాణిస్తుంది. ఈ రైలు సాధారణ సేవలు వైజాగ్-సికింద్రాబాద్ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల బుకింగ్స్ మార్చి 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏడు ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్బిగ్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లతో ప్రయాణిస్తుంది. అన్ని బోగీలలో కలిపి మొత్తం 530 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
Last Updated : Mar 12, 2024, 10:04 AM IST