LIVE : నాగర్ కర్నూల్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ - ప్రత్యక్షప్రసారం - prime minister modi live
Published : Mar 16, 2024, 11:59 AM IST
|Updated : Mar 16, 2024, 12:53 PM IST
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు ఆయన హాజరయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్లో కాసేపటి క్రితం నాగర్ కర్నూల్ చేరుకున్న మోదీ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 నియోజక వర్గాల నుంచి సుమారు లక్షమందిని మోడీ సభకు తరలించింది. మహబూబ్నగర్ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నాగర్ కర్నూల్ అభ్యర్ధి భరత్ ప్రసాద్ ఈసారి బరిలో ఉన్నారు. తెలంగాణ నుంచి 12 స్థానాలపై బీజేపీ గురిపెట్టింది. అందుకు అనుగుణంగానే బీజేపీ ప్రచార ప్రణాళిక సిద్దం చేసింది. ఎల్లుండి మోదీ జగిత్యాల సభలో పాల్గోనున్నారు.
Last Updated : Mar 16, 2024, 12:53 PM IST