సముద్రంలో దూకబోయిన మహిళ! 'సూపర్ హీరో'లా కాపాడిన క్యాబ్ డ్రైవర్ - Woman Suicide Attempt Foiled
Published : Aug 17, 2024, 11:04 AM IST
|Updated : Aug 17, 2024, 11:38 AM IST
Police Save Woman From Self Harm Attempt : సముద్రంలో దూకబోయిన ఓ మహిళను చాకచక్యంగా కాపాడాడు ఓ క్యాబ్ డ్రైవర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముంబైలోని ములుండ్‌కు చెందిన 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్ శుక్రవారం సాయంత్రం క్యాబ్ బుక్ చేసుకొని 7గంటల సమయంలో అటల్ సేతుపైకి చేరుకుంది. మహిళ కారు దిగి అటల్ బ్రిడ్జి రెయిలింగ్ ఎక్కింది. అక్కడి నుంచి మొదట సముద్రంలోకి ఏవో వస్తువులు విసిరేసింది. అనంతరం బ్రిడ్జి రెయిలింగ్‌పై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ ఆమె జుట్టును పట్టుకొని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆలోపే పెట్రోలింగ్ పోలీసులు వేగంగా స్పందించి ఆమెను సముద్రంలో పడిపోకుండా కాపాడారు. ఈ దృశ్యాలు సీసీటీవి కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ముంబయి సీపీ, ఆత్మహత్యయత్నం చేయగా ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులు కాపాడారని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా, దీనిపై పోలీసులు ఆ మహిళను ప్రశ్నించగా తాను దేవతామూర్తుల ఫోటోలను సముద్రంలో నిమజ్జనం చేసేందుకు వచ్చానని తెలపడం గమనార్హం.