బాలయ్య గోల్డెన్ జూబ్లీ- మోషన్ పోస్టర్ రిలీజ్ - Nandamuri Balakrishna 50 Years - NANDAMURI BALAKRISHNA 50 YEARS
Published : Aug 7, 2024, 10:54 PM IST
Nandamuri Balakrishna 50 Years: నటుడిగా నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ క్లబ్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్బీకే 50 ఇయర్స్ సెలబ్రేషన్ మోషన్ పోస్టర్ తోపాటు కర్టెన్ రైజర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి నందమూరి సోదరులు రామకృష్ణ, మోహన్ కృష్ణతోపాటు తెలుగు చిత్ర ప్రముఖులు, దర్శక నిర్మాతలు హాజరై బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకల వివరాలతోపాటు ఆయనతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగే ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాగా, బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి 2024 ఆగస్టు 30తో 50ఏళ్లు పూర్తవుతుంది. 1974 ఆగస్టు 30న వచ్చిన 'తాతమ్మ కల' సినిమాతో బాలయ్య తెరంగేట్రం చేశారు.