LIVE : సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు - HARISH RAO LIVE - HARISH RAO LIVE
Published : Apr 8, 2024, 1:29 PM IST
|Updated : Apr 8, 2024, 1:50 PM IST
Harish Rao Live : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైనా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని తమ ఓటమి తాత్కాలికమేనని నిరూపించేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.నేతలు పార్టీ వీడి వెళ్లడం బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని అన్నారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని హరీశ్‌రావు తెలిపారు. అయినా కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపెట్టారని పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలోనూ కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని మండిపడ్డారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరని అన్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీలో నుంచి వెళ్తున్నారని తెలిపారు. పార్టీ వీడినవారిని మళ్లీ తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని మండిపడ్డారు. తాజాగా సిద్దిపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 8, 2024, 1:50 PM IST