తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హనుమకొండలో కేసీఆర్ బస్సు యాత్ర - KCR BUS YATRA IN HANAMAKONDA LIVE - KCR BUS YATRA IN HANAMAKONDA LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 8:37 PM IST

Updated : Apr 28, 2024, 9:00 PM IST

Former CM KCR Lok Sabha Election Campaign in Hanamakonda Live : బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హనమకొండ​లో రోడ్​ షోలో పాల్గొన్నారు. సాయంత్రం పూట హైదరాబాద్​ నుంచి బస్సులో బయలుదేరిన కేసీఆర్​ జనగామ, స్టేషన్​ఘన్​పూర్​ మీదగా హనమకొండ​ చేరుకున్నారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి మారపెల్లి సుధీర్​ కుమార్​ విజయాన్ని కాంక్షిస్తూ అంబేడ్కర్​ కూడలి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్​షో నిర్వహించారు. ఈ రోడ్​ షోలో మాజీ సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. ఈ రోడ్​షోకు బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో మాజీ సీఎం కేసీఆర్​ విరుచుకుపడ్డారు. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి జాయిన్​ అయి స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యపై మండిపడ్డారు. అలాగే బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​పై విమర్శలు చేస్తూ, వరంగల్​ బీఆర్​ఎస్​ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
Last Updated : Apr 28, 2024, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details