LIVE : రైతు రుణమాఫీ పథకం ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth reddy LIVE - CM REVANTH REDDY LIVE
Published : Jul 18, 2024, 4:09 PM IST
|Updated : Jul 18, 2024, 5:13 PM IST
CM Revanth Reddy On Rythu Runa Mafi : రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లక్ష రూపాయల వరకు రుణబకాయిలను ప్రభుత్వం మాఫీ చేసినట్లు ప్రకటించింది. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో 7వేల కోట్ల రూపాయలు సర్కార్ జమ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది. భూమి పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రుణ బకాయిలున్న సుమారు 6 లక్షలా 36 వేల మంది రైతులకు రేషన్ కార్డులు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. రేషన్‌కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.
Last Updated : Jul 18, 2024, 5:13 PM IST