తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలి : నారాయణ - CPI Narayana latest news
Published : Jan 28, 2024, 7:30 PM IST
CPI Narayana Comments On Bihar CM Nitish Kumar : బిహార్లో ఇండియా కూటమికి వ్యతిరేఖంగా నీతీశ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీ ఇండియా కూటమి ఎమ్మెల్యేలను డబ్బులు, ఈడీ, సీబీఐ కేసులంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తుందని మండి పడ్డారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ఎల్కే అద్వానీని మోదీ ఆహ్వానించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇండియా కూటమికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ, ఆ కూటమిలోని పార్టీలను మోదీ ప్రభుత్వం భయపెడుతోందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ను కోరారు. రాష్ట్రం నుంచి కమ్యూనిష్టు నాయకులు పార్లమెంట్లో ఉండాలని తెలిపారు.
CPI Narayana Fires On BJP : గడిచిన పదేళ్లలో బీజేపీ జనగణన చేపట్టలేదని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిందని గుర్తు చేశారు. మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లను రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. హైదరాబాద్లో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని నారాయణ తెలిపారు. ఈ సమావేశాల అనంతరం దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయని నారాయణ ధీమా వ్యక్తం చేశారు.