LIVE : మంత్రి ఉత్తమ్‌కుమార్ తండ్రి భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళులు - CM Revanth Tribute To Uttam father
Published : Sep 29, 2024, 5:41 PM IST
|Updated : Sep 29, 2024, 5:56 PM IST
CM Revanth Tribute To Minister Uttam Father Live : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి నలమాద పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఉత్తమ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, నివాళులర్పించారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాప్రస్థానానికి చేరుకొని పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Last Updated : Sep 29, 2024, 5:56 PM IST