LIVE: కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU IN KANDUKUR LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2025, 3:54 PM IST
|Updated : Feb 15, 2025, 4:41 PM IST
CM CHANDRABABU IN KANDUKUR LIVE: నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, దూబగుంటలో గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వేస్ట్ టు వెల్త్ అనేది తన నినాదమని ముఖ్యమంత్రి అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్రిమిసంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తుందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగం కావాలని మీ దగ్గరికి వచ్చానన్న సీఎం, స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కందుకూరు చేరుకున్న సీఎంకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ప్రస్తుతం కందుకూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు.
Last Updated : Feb 15, 2025, 4:41 PM IST