LIVE: తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU AT ITCX 2025
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2025, 4:40 PM IST
|Updated : Feb 17, 2025, 7:07 PM IST
CM CHANDRABABU AT ITCX 2025: తిరుపతిలో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు పర్యటిస్తున్నారు. తిరుపతిలో నేటి నుంచి మూడురోజుల పాటు టెంపుల్ ఎక్స్‌పో జరుగుతోంది. తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పోను ముగ్గురు సీఎంలు ప్రారంభిస్తున్నారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది. తొలిరోజు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొననున్నారు. సదస్సులో 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధుల హాజరుకానున్నారు. 111 మంది ప్రముఖ వక్తలు, 60 కిపైగా స్టాల్స్, 15 వర్క్ షాప్‌లను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థను పెంపొందించడంపై మూడు రోజుల పాటు సదస్సు జరుగనుంది. మూడు గంటల నుంచి ప్రారంభం కానున్న సదస్సుకు ముఖ్యమంత్రులు హాజరుకానుండటంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 17, 2025, 7:07 PM IST