సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU MEETING MINISTERS LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/640-480-23518177-thumbnail-16x9-chandrababu-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2025, 11:09 AM IST
|Updated : Feb 11, 2025, 11:15 AM IST
Chandrababu Meeting With Ministers Live : సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. పాలనా అంశాలపై మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. రెండు సెషన్లుగా మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమావేశం కానున్నారు. తొలి సెషన్‌లో దస్త్రాల క్లియరెన్స్, జీఎస్‌డీపీ, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగిపై చర్చిస్తున్నారు. రెండో సెషన్‌లో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్, కేంద్ర బడ్జెట్, స్వర్ణాంధ్ర 2047 అంశాలపై చర్చించనున్నారు. సమర్థ నాయకత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించాలని పేదలకు పంచాలని చెప్పారు. ఆరు నెలల పాలనలో 12.94 వృద్ధి రేటు కనపడిందన్నారు. గత ఐదేళ్ల విధ్వంసం వల్ల చాలా వెనుకబడి పోయామని నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలని వచ్చిన సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. ఇదేదో కొంతమందిని ఎత్తిచూపడం కాదు వ్యవస్థ మెరుగపడాలని సూచించారు. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Last Updated : Feb 11, 2025, 11:15 AM IST