LIVE: మార్గదర్శి అంశంపై ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - MARGADARSI ISSUE LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/640-480-23527746-thumbnail-16x9-mp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2025, 3:04 PM IST
LIVE: తన తండ్రి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, తన మద్యం కుంభకోణాల గురించి ‘ఈనాడు- ఈటీవీ’ వెలుగులోకి తేవడంతో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మతితప్పినట్లు పార్లమెంటులో మార్గదర్శిపై అబద్ధాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు 1.0, 2.0 అంటూ అయోమయంగా మాట్లాడుతుంటే మిథున్‌రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘మార్గదర్శి సంస్థ డిపాజిటర్లను మోసగించిందని, ఆ సంస్థపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద కుంభకోణాల్లో అది ఒకటని పేర్కొన్నారు. వాళ్లు ప్రతిరోజూ తమ గురించి వార్తలు రాస్తున్నా తాము పట్టించుకోబోమని టీడపీ నేతలు వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్ర అంశాలను వదిలిపెట్టి ఎంతసేపూ ఈనాడు, ఈనాడు అంటూ కలవరిస్తున్నారు. మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చూపించే సంస్థల్లో ఈనాడు- ఈటీవీ ఒకటి. మేం తప్పు చేసినా వాళ్లు చూపిస్తున్నారు. అలాంటి పత్రికలో తన తండ్రి పెద్దిరెడ్డిపై వచ్చిన వార్తను మనసులో పెట్టుకొని మిథున్‌రెడ్డి మార్గదర్శిపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మార్గదర్శి అంశంపై ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.